Asianet News TeluguAsianet News Telugu

ఘోర ప్రమాదం... తృటిలో తప్పించుకున్న సింగర్

హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లోని హీరోహోండా చౌరస్తా వద్ద సప్నా చౌదరి కారును మరో కారు ఢీకొంది. అయితే సప్నాచౌదరి ఈ ప్రమాదంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.

Gurugram: Haryani singer and dancer sapna chaudhary cae crashed, narrowly escaped
Author
Hyderabad, First Published Dec 28, 2019, 8:09 AM IST

ప్రముఖ పాప్ సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వగా... ఆమె క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తన ఆట, పాటలతో ప్రేక్షకులను అమితంగా అలరించే డాన్సర్ సప్నా చౌదరి రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో సప్నా చౌదరి క్షేమంగా బయటపడ్డారు. అయితే కారు చాలావరకూ ధ్వంసమయ్యింది. 

ఈ కారును ఆమె డ్రైవర్ నడుపుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లోని హీరోహోండా చౌరస్తా వద్ద సప్నా చౌదరి కారును మరో కారు ఢీకొంది. అయితే సప్నాచౌదరి ఈ ప్రమాదంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కాగా ఇటీవలి కాలంలో సస్నాచౌదరి వివాహాలు, బర్త్ డే పార్టీలలో ప్రదర్శనలు ఇస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios