అత్యాచారం, హత్య తదితర నేరాలపై దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ బాబా అలియాస్ డేరా బాబా చాలా రోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. తాను వ్యవసాయం చేసుకుంటానని అందుకు వీలుగా పెరోల్ ఇప్పించాల్సిందిగా అతను సిర్సా జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.

తాను చేసినవి క్షమించరాని నేరాలు కాదని.. జైలులో తన ప్రవర్తన కూడా సంతృప్తికరంగా ఉందని కాబట్టి తాను పెరోల్‌‌కు అర్హుడినేని పేర్కొన్నాడు. సిర్సా జైలు యాజమాన్యం ప్రస్తుతం ఈ దరఖాస్తును పరిశీలిస్తోంది. తన ఆశ్రమంలో పనిచేసే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశాడని రుజువు కావడంతో డేరా బాబా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.