Asianet News TeluguAsianet News Telugu

విచిత్రం : కుక్కను.. కుక్కా అన్నందుకు ఆరుగురి తలలు పగలగొట్టారు..

కుక్కని కుక్కా.. అని పిలిచినందుకు.. చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు తలలు పగలగొట్టుకునే వరకు వచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్ కి చెందిన జ్యోతిపార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం టామీ అనే కుక్కని పెంచుకుంటోంది. 

gurgram man beats up neighbors family over dog - bsb
Author
Hyderabad, First Published May 12, 2021, 5:02 PM IST

కుక్కని కుక్కా.. అని పిలిచినందుకు.. చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు తలలు పగలగొట్టుకునే వరకు వచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్ కి చెందిన జ్యోతిపార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం టామీ అనే కుక్కని పెంచుకుంటోంది. 

అయితే ఆ కుక్క స్థానికుల్ని కరవడం, భయపెట్టడం చేస్తుండేది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే సుధీర్ అనే వ్యక్తి కుక్కని చైన్ కి కట్టేయచ్చు కదా, మా పిల్లల్ని కరుస్తోంది అని, కుక్క యజమానిని రిక్వెస్ట్ చేశాడు. 

అంతే మా టామీని కుక్క అని పిలుస్తావా? నీకెంద ధైర్యం అంటూ దాని యజమాని, యజమాని కుటుంబ సభ్యులు సుధీర్ కుటుంబం మీద దాడికి దిగారు. రాడ్లు , కర్రలతో దాడి చేశారు. 

ఈ దాడిలో సుధీర్ కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో స్థానికులు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘర్షణ అనంతరం సుధీర్ సదరు కుక్క యజమాని కుటుంబసభ్యలపై దాడి చేశాడు. 

ఆ తరువాత.. ఆ కుక్క మా పిల్లల్ని కరుస్తోందని యజమానికి చెప్పా, టామీని కుక్కా అని పిలుస్తావా అని కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, గురుగ్రామ్ లో కుక్కల వల్ల ఘర్షణ పడ్డ సంఘటనలు గతంలో చాలానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. 

అందరూ కరోనా వల్ల ఇబ్బంది పడుతుంటే వీళ్లే మాత్రం కుక్క గురించి తలలు పగిలేలా కొట్టుకోవడం ఏమిటోనని గురుగ్రామ్ పోలీసులు నిట్టూరుస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘర్షణ మీద తమదైన స్టైల్లో  కామెంట్లు చేస్తున్నారు. అరే ఏంట్రా ఇది.. కుక్కని కుక్కా అని పిలవకూడదా? అంత మాత్రనికే తలలు పగలగొట్టాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios