మెట్రో స్టేషన్ లో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మెట్రో ఎస్కలేటర్ పై స్టేషన్ లోకి వస్తున్న మహిళ పై  ఓ వ్యక్తి  హస్తప్రయోగం చేశాడు. అతని ప్రవర్తనతో మొదట కంగుతిన్న మహిళ.. తర్వాత తేరుకొని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీక చెందిన ఓ మహిళ ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపు పొందింది. ఆమె గుడ్ గావ్ మెట్రో స్టేషన్ లోని మొదటి ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన క్లాత్ స్టోర్ కి వెళ్తోంది. ఆమె ఎస్కలేటర్ పై ఉన్న సమయంలో.. తన వెనక ఏదో జరుగుతున్నట్లు ఆమెకు అనిపించింది. వెంటనే తేరుకొని వెనక్కి తిరిగే సరికి ఓ యువకుడు ఆమెపై హస్త ప్రయోగం చేస్తున్నాడు. అతని చేతులతో ఆమె వెనుక భాగాన్ని అసభ్యంగా తాకుతూ హస్త ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. 

ముందు భయంతో వణికిపోయింది. ఆ వెంటనే తేరుకొని అతనిపై అరిచేసింది. అతని చెంప పగలకొట్టి... సహాయం కోసం అరిచింది. కానీ అక్కడ ఎవ్వరూ ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. ఆ సమీపంలో పోలీసులు కూడా ఎవరూ లేరు. దీంతో వెంటనే ఆమె ఫేస్ బుక్ సహాయంతో గుడ్ గావ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా... పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో... ఆమె ట్విట్టర్ వేదికగా మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమెను సంప్రదించి సీసీ కెమేరాలో రికార్డు అయిన వీడియో సహాయంతో... నిందితుడిని గుర్తించారు. మహిళ రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే... అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.