అప్పు తీర్చలేక బిజినెస్ పార్టనర్ ని హత్య చేసి.. పోలీసులకు దొరికిపోతామేననే భయంతో.. భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ.. అందుకు భార్య అంగీకరించకపోవడంతో.. భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుడ్ గావ్ కి చెందిన హర్నీక్ సింగ్.. జస్ కరణ్ సింగ్ దగ్గర రూ.40లక్షల అప్పు తీసుకున్నాడు. వీరిద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు. కాగా.. అప్పు తీసుకొని నెలలు గడుస్తున్నా.. హర్నీక్ తిరిగి ఇవ్వలేదు.

దీంతో.. ఆ డబ్బుని వసూలు చేసుకునేందుకు ఇటీవల జస్ కరణ్ సింగ్.. హర్నీక్ ఇంటికి వచ్చాడు. ఈ విషయంలో మాటామాట పెరిగి గొడవ జరిగింది. వెంటనే.. హర్నీక్.. భార్య సహాయంతో జస్ కరణ్ ని హత్య చేశాడు. అనంతరం అతని శరీరాన్ని 24 నుంచి 25 ముక్కలుగా నరికేశాడు.

ఆ శరీరభాగాలన్నింటినీ.. సంచుల్లో పెట్టి.. ఒక్కో ముక్కను ఒక్కో ప్రాంతంలో విసిరేశాడు. అయితే.. ఎలాగైనా పోలీసులు అతనిని పట్టుకుంటారేమో అనే అనుమానం కలిగింది. దీంతో.. భార్యతో కలిసి ఇద్దరం సూసైడ్ చేసుకుందామని కోరారు.

అందుకు భార్య అంగీకరించకపోవడంతో.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తన చేతికి గాయం చేసుకొని..దొంగలు.. తనపై దాడి, భార్యను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అతను చెబుతున్న మాటలు నమ్మసక్యంగా లేకపోవడంతో.. పోలీసులకు అనుమానం కలిగింది. అదుపులోకి తీసుకొని విచారించగా...అసలు నిజాలు బయటపడ్డాయి.