Asianet News TeluguAsianet News Telugu

Gurugram: అధికారుల‌తో క‌లిసి ఫైనాన్స్ సంస్థకు టోకరా.. గురుగ్రామ్ లో బెంజ్ కార్ల స్కామ్ !

Gurugram: అధికారుల‌తో క‌లిసి ఫైనాన్స్ కంపెనీకి టోక‌రా పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడు ఓ వ్య‌క్తి. దీని కోసం ఏకంగా ఐదు మెర్సిడెస్ బెంజ్ కార్ల కొనుగోలు స్కామ్‌కు తెర‌లేపాడు. దీనిని గుర్తించిన స‌ద‌రు ఫైనాన్స్ కంపెనీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

Gurgaon Man Bought 5 Mercedes Cars In 3 Years. It Was A Scam
Author
Hyderabad, First Published Jan 27, 2022, 10:39 AM IST

Gurugram: అధికారుల‌తో క‌లిసి ఫైనాన్స్ కంపెనీకి టోక‌రా పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడు ఓ వ్య‌క్తి. దీని కోసం ఏకంగా ఐదు మెర్సిడెస్ బెంజ్ (Mercedes Cars) కార్ల కొనుగోలు స్కామ్‌కు తెర‌లేపాడు. మూడు సంవ‌త్స‌రాల్లో అత్యంత ఖ‌రీదైన ఐదు మెర్సిడెజ్ బెంజ్ కార్ల‌ను కొనుగోలు చేశాడు. ఇది ఒక స్కామ్ ప్ర‌కారం జ‌రిగింద‌ని అత‌నికి ఫైనాన్స్ (finance company) అందించిన స‌ద‌రు ఫైనాన్స్ కంపెనీ పేర్కొంది. ఈ స్కామ్‌ను గుర్తించిన ఫైనాన్స్ కంపెనీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల్లోకెళ్తే.. గురుగ్రామ్ (Gurugram)కు చెందిన ఓ వెహికల్ ఫైనాన్స్ కంపెనీని 2.18 కోట్ల రూపాయ‌ల‌ను మోసం చేసిన 42 ఏళ్ల వ్యక్తి, అజ్ఞాతంలోకి వెళ్లిన మూడేళ్ల తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఫైనాన్స్ కంపెనీ ఫిర్యాదు మేరకు 2018లో నిందితుడు గుర్గావ్ నివాసి ప్రమోద్ సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు  వెల్ల‌డించారు. పోలీసు జాయింట్ కమిషనర్ (ఆర్థిక నేరాల విభాగం) ఛాయా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ కు చెందిన ప్ర‌మోద్ సింగ్.. మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేయడానికి ఓ ఫైనాన్స్ సంస్థ నుండి మొదట రూ. 27.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ త‌ర్వాత ప్రారంభ వాయిదాలను చెల్లించాడు. ఫైనాన్సర్ నమ్మకాన్ని సంపాదించిన తర్వాత.. మ‌రో నాలుగు వాహ‌నాలు కోనుగోలు చేయ‌డానికి స‌ద‌రు ఫైనాన్స్ కంపెనీ నుంచి అప్పు తీసుకున్నాడు. అయితే, కొంత కాలం పాటు వాయిదాలు చెల్లించిన నిందితుడు.. అకస్మాత్తుగా వాయిదాలు చెల్లించ‌డం ఆపేశాడు.

ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే స్కామ్ (Scam) పాల్పడిన‌ట్టు ప్ర‌మోద్ సింగ్ కు ఫైనాన్స్ అందించిన సంస్థ గుర్తించింది. ఇదే  విష‌యం గురించి పోలీసుల‌కు ఫైనాన్స్ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచార‌ణ సాగించిన అధికారులు రవాణా శాఖలోని కొందరు అధికారులు సింగ్‌తో చేతులు కలిపినట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదుదారు ప్రకారం.. ప్ర‌మోద్ సింగ్ సంస్థకు ₹ 2.18 కోట్ల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంది. అయితే, నిందితుడు గత మూడేళ్లుగా కనిపించకుండా పోవడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ  అయ్యాయి. సుదీర్ఘ ద‌ర్యాప్తు, అత‌నిపై నిఘా ఉంచిన పోలీసులు (Police).. నిందితుడు ప్ర‌మోద్ సింగ్‌ను గురుగ్రామ్‌లోనే అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసు జాయింట్ కమిషనర్ (ఆర్థిక నేరాల విభాగం) ఛాయా శర్మ తెలిపారు. "వాహనాలను హైపోథీకేట్ చేసి, ఫిర్యాదుదారు కంపెనీ ఫైనాన్స్ చేసినప్పటికీ, నకిలీ పత్రాలను సృష్టించి, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల నుండి ఫిర్యాదుదారు కంపెనీ పేరును ఫైనాన్షియర్‌గా నిందితులు తొలగించారని కూడా ఆరోపించబడింది" అని ఆమె చెప్పారు.

మూడు సంవత్సరాలలో సింగ్ ఐదు మెర్సిడెస్ కార్ల (Mercedes cars)ను కొనుగోలు చేశాడని, వాటన్నింటికీ అదే సంస్థ ఆర్థిక సహాయం చేసిందని అధికారి తెలిపారు. రవాణా శాఖలోని కొందరు అధికారులు వాహనాలను రికార్డుల నుండి తొలగించారని, ఆ తర్వాత అతను కార్లను అక్ర‌మ మార్గంలో సెకండ్ హ్యాండ్ కార్ డీలర్‌లకు విక్రయించేవాడని  పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios