గుర్గావ్ లో ఓ 18 అంతస్తుల బిల్డింగ్ పేక మేడలా కూలిపోయింది. 18వ ఫ్లోర్ లోని ఒక ఫ్లాట్ లో మొదలై మొదటి అంతస్తు వరకు కూలిపోతూ వచ్చింది. దీంతో అందులో నివసిస్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు శిథిలాల్లో చిక్కుకుపోయారు.
గుర్గావ్ : బిల్డర్ నిర్లక్ష్యం,నాణ్యతా లోపం నాలుగేళ్లకే ఆ అపార్ట్ మెంట్ వాసులకు శాపంగా మారింది. పద్దెనిమిది అంతస్తుల ఆ బిల్డింగ్ లోని ఓ భాగం కూలడం మొదలుపెట్టి దాని కింది అంతస్తులను కలుపుకుంటూ.. గ్రౌండ్ ఫ్లోర్ వరకూ కూలిపోవడం భయాందోళనలు కలిగించింది. అందరూ ఇళ్లకు చేరిన వేళ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ శబ్దానికి ఆ టవర్ లోని వారు.. పక్క టవర్స్ లోని వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Gurgaonలోని సెక్టార్ 109లో నివాస గృహాలపైకప్పు గురువారం రాత్రి కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, పలువురు శిథిలాల్లో చిక్కుకుపోయి.. భయాందోళనలకు గురయ్యారు. మొదట 18-అంతస్తుల Chintels Paradiso హౌసింగ్ కాంప్లెక్స్‌లోని అపార్ట్‌మెంట్‌లోని లివింగ్ రూమ్ కూలిపోయింది. అక్కడినుంచి దాని కింది అంతస్తుల్లోని అపార్ట్ మెంట్ల పైకప్పులు వరుసగా కూలిపోయాయని వార్తా సంస్థ PTI సమాచారం.
శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF బృందం పని చేస్తోంది. సహాయకార్యక్రమాల్లో తీసిన వీడియోల్లో ఈ బృందం మెరిసే నారింజరంగు జాకెట్లు ధరించిన రెస్క్యూ టీం సభ్యులు అపార్ట్ మెంట్ పై అంతస్తులకు చేరుకోవడానికి నిచ్చెనలను అమర్చుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
"ఆరవ అంతస్తులోని ఓ ప్లాట్ లో ఉన్న డ్రాయింగ్ రూమ్ కూలి మొదటి అంతస్తు అలా పడిపోయింది’’ అని అపార్ట్ మెంట్లో నివాసం ఉండే కౌశల్ కుమార్ చెప్పారు, ఈ సంఘటన high-riseలోని "టవర్ D"లో జరిగిందని తెలిపారు.పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్వీట్ చేశారు.
"గురుగ్రామ్‌లోని ప్యారడిసో హౌసింగ్ కాంప్లెక్స్ వద్ద అపార్ట్‌మెంట్ పైకప్పు దురదృష్టవశాత్తు కూలిపోవడంతో అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ, రిలీఫ్ పనిలో బిజీగా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రార్థిస్తున్నాను" అని ఖట్టర్ ట్వీట్ చేశారు.
ప్రమాదం జరిగిన టవర్ డిని 2018లో నిర్మించారు. ఈ కాంప్లెక్స్ లో టవర్ డితో పాటు ఇంకా మూడు టవర్లు ఉన్నాయని నివాసితులు తెలిపారు. 18-అంతస్తుల టవర్ D ఫోర్ బెడ్ రూం అపార్ట్మెంట్లు అని వారు చెబుతున్నారు. హౌసింగ్ కాంప్లెక్స్ మేనేజ్‌మెంట్ ఈ ఘటన మీద స్పందిస్తూ "నిర్లక్ష్యం" కారణంగా "అత్యంత దురదృష్టకర సంఘటన" అని బ్లేమ్ చేసింది. ఇది రాత్రి 7 గంటల సమయంలో జరిగిందని పిటిఐ తెలిపింది.
