Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. వచ్చిన ప్యాక్ చూసి షాక్ అయిన గురుగ్రామ్ వాసి..

జొమాటో కొత్తగా ప్రారంభించిన ఇంటర్సిటీ లెజెండ్స్ సేవలను వినియోగించుకోవాలనుకున్న ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసిన గురుగ్రామ్ వాసికి కేవలం సాలన్ మాత్రమే వచ్చింది. 

Gurgaon customer order hyderabad biryani in zomato intercity, gets only salan
Author
First Published Sep 8, 2022, 9:37 AM IST

గురుగ్రామ్ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో తీసుకువచ్చిన ఇంటర్సిటీ లెజెండ్స్ సేవలకు భోజనప్రియులు నుంచి ఆదరణ లభిస్తోంది. ఇతర నగరాల్లో పేరొందిన వంటకాలను రుచి చూసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ సేవలను ప్రయత్నించాడు. కానీ, ఆయనకు చేదు అనుభవం ఎదురయింది. హైదరాబాద్ బిర్యానీ కోసం ఆర్డర్ చేస్తే.. జొమాటో కేవలం సాలన్ మాత్రమే డెలివరీ చేసింది. పైగా ఆ వ్యక్తి జొమాటో వాటాదారుడే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే…

గురుగ్రామ్ కు చెందిన ప్రతీక్ కన్వాల్ ఇటీవల జొమాటో ఇంటర్సిటీ లెజెండ్ సేవలను ప్రయత్నించారు. హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే జొమాటో ఆయనకు బిర్యానీ బదులుగా సాలన్ (బిర్యానీకి సైడ్ డిష్ గా ఇచ్చే వంటకం) మాత్రమే డెలివరీ చేసింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ప్రతీక్..  ట్విట్టర్ వేదికగా తన చేదు అనుభవాన్ని వివరించారు. ‘జొమాటో ఇంటర్సిటీ లెజెండ్ సర్వీస్ మంచి ఐడియా అనిపించింది. కానీ దీనివల్ల నా డిన్నర్ ప్లాన్స్ గాలిలో కలిశాయి. ఓ కస్టమర్ గా,  జొమాటో వాటాదారుగా ఇది నాకు రెట్టింపు నష్టమే. ఇందులో వైఫల్యం ఎక్కడుందో దీపిందర్ గోయల్ (జొమాటో సీఈఓ) వెంటనే గుర్తించాలి.  కనీసం మరోసారి ఇలా జరగకుండా చూడాలి’ అని ప్రతీక్ రాసుకొచ్చారు. జొమాటో, deepinder goyal ట్విట్టర్ కు ఈ ట్వీట్ ను  ట్యాగ్ చేశారు. 

డ్రెస్ వేసుకునే హక్కు ఉందంటే.. విప్పుకునే హక్కు కూడా ఉంటుందా? హిజాబ్ బ్యాన్‌పై విచారణలో సుప్రీంకోర్టు షాకింగ్

అయితే ఈ ట్వీట్ పై జొమాటో కస్టమర్ సర్వీస్ వెంటనే స్పందించింది. ప్రతీక్ కు క్షమాపణలు చెప్పడంతో పాటు అదనంగా మరో బిర్యాని కూడా అందించింది. ఈ విషయాన్ని కూడా ప్రతీక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కారం అయిందని..  కనీసం కస్టమర్ కేర్ సర్వీస్ అయినా వేగంగా స్పందించినందుకు ఓ వాటాదారుడిగా తాను కాస్త సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios