చిత్తూరు జిల్లా కుప్పంకు సమీపంలోని తమిళనాడు సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. డీఎంకే నేత వేలాయుధంపై గుర్తు తెలియని దుండుగులు నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అనుచరులు ఆయనను వాణీయంబడి ఆసుపత్రికి తరలించారు.

కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం నారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపుకు పరారైనట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన తమిళనాడు వాణీయంబడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.