భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో ఆజాద్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాడి చేసిన వ్యక్తులు హర్యానా రవాణా శాఖ నెంబర్ ప్లేట్ వున్న కారులో ఘటనాస్థలికి చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

కాల్పులు జరిగిన సమయంలో ఆజాద్ టయోటా ఫార్చ్యూనర్‌ కారులో ప్రయాణిస్తున్నారు. వాహనం సీటు , డోర్‌పై బుల్లెట్ గుర్తులు వున్నాయి. దుండగులు వెనుక నుంచి కారు వద్దకు వచ్చి చంద్రశేఖర్ ఆజాద్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.