ఆమెకు అప్పటికే పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుళ్లలో కూడా ఓకరికి పెళ్లైంది. కాగా... ఆమెకు భర్తతో మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. దీంతో.. భర్తకు విడాకులు ఇచ్చేసింది. మరో వ్యక్తితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రియుడితో ఓ బిడ్డను కూడా కన్నది. అయితే.. ఇప్పుడు ఆ ప్రియుడు.. తన ఇద్దరు కూతుళ్లు ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ కి చెందిన రంజన్ బేన్.. భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన ఇద్దరు కూతుళ్లతో ఒంటరిగా జీవిస్తోంది. ఆ తర్వాత ఆమెకు గిరిశ్ పరామర్ అనే వ్యక్తితో మూడున్నరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సహజీవనానికి దారి తీసింది. వీరిద్దరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది.

కాగా.. కొంత కాలం క్రితం రంజన్.. తన పెద్ద కూతురికి పెళ్లి చేసింది. అయితే.. తరచూ రంజన్.. తన ప్రియుడు పరామర్, తన ఇద్దరు కూతుళ్లను డబ్బు కోసం వేధిస్తూ ఉండేది. తరచూ తనకు డబ్బులు కావలంటూ వాళ్లను అడిగేది. ఆఖరికి తన పెద్ద కుమార్తె భర్త వద్ద కూడా కొంత డబ్బు తీసుకుంది.

ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో.. అతను భార్యను వదిలేశాడు. దీంతో.. రంజన్ పెద్ద కూతురు నాలుగు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. తన తల్లి కారణంగానే తాను పుట్టింట్లో ఉండాల్సి వస్తోందని ఆమె మనసులో నాటుకుపోయింది. అంతేకాకుండా.. ఊరికే డబ్బుల కోసం విసిగిస్తోందనిజ. పరామర్ కి కూడా ఆమె పై కోపం పెరిగింది.

ఈ క్రమంలో పరామర్, రంజన్ ఇద్దరు కూతుళ్లు కలిసి ప్లాన్ వేశారు. ఆమె నిద్రపోతుండగా... ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశారు. ఆమె చనిపోయిందని నిర్థారించుకున్న తర్వాత రంజన్ పెద్ద కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి తన తల్లి చనిపోయిందని ఫిర్యాదు చేసింది.

సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు..కూతుళ్ల ప్రవర్తన మీద అనుమానం కలిగింది. కాగా.. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా...వాళ్లు చేసిన నేరం అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.