తల్లి కావడం స్త్రీత్వానికి ప్రతీక, అలాగే తండ్రి కావడం పురుషత్వానికి గుర్తు. అందుకే ప్రతీ స్త్రీ తల్లికావాలని కోరుకుంటుంది. ప్రతీ పురుషుడు తండ్రి కావాలని ఉవ్విలూరతాడు. అయితే ఈ రెండు లక్షణాలూ ఉన్న ఓ డాక్టర్ మాత్రం ఏ వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యింది. అదే కనుక నిజమైతే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ సాధిస్తుంది. 

అదేంటంటే తనకు పుట్టబోయే బిడ్డకు తల్లీ, తండ్రీ రెండూ తానే అవ్వలనుకుంటుంది. అంటే సింగిల్ పేరెంట్ గా పెంచి పెద్ద చేయడం కాదు. తన వీర్యం, తన అండాలతోనే బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. కాస్త తికమకగా ఉందా.. అయితే స్టోరీ మొత్తం చదివేయండి.. 

అహ్మదాబాద్ గోద్రాలోని చిన్న గ్రామమైన పంచమహల్ లో జన్మించిన జెస్నూర్ డయారా. పుట్టుకతో మగవాడు. పెరుగుతున్న కొద్దీ అతనిలో మార్పులు రావడం, స్త్రీ లక్షణాలు పెరుగుతుండడంతో తానో ట్రాన్స్ జెండర్ అనే విషయం స్పష్టమయ్యింది. 

ఇప్పటికే ఈ 25ఏళ్ల డాక్టర్ జెస్నూర్ డయారా ట్రాన్స్ జెండర్ డాక్టర్ చదువు పూర్తి చేశారు. ఇప్పుడు పూర్తిగా స్త్రీగా మారిపోవాలనుకుంటోంది. అయితే ఇలా మారాలన్న ఆలోచన వచ్చిన టైంలోనే మరో ఆలోచన కూడా వచ్చింది. స్త్రీగా పుట్టాక తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి కూడా తానే కావాలనుకుంది. 

అందుకే పురుషుడిగా ఉన్నప్పుడే తన వీర్యం భద్రపరచాలని డిసైడ్ అయ్యింది. దీనికోసం ఆనంద్ లోని ఫెర్టిలిటీ సెంటర్ లో తన వీర్యాన్ని క్రయోజనిక్ పద్ధతిలో భద్రపరిచింది. తాను స్త్రీగా మారిన తరువాత ఈ వీర్యాన్ని వినియోగించి బిడ్డను కనాలని భావిస్తోంది.

తొందర్లో  సర్జరీతో ఆమె పూర్తిగా స్త్రీగా మారిపోబోతోంది. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత ఈ వీర్యంతో ఆమె తల్లికానుంది. ఆమె కోరిక ఫలించి, అదే కనక జరిగితే ఒక బిడ్డకు జెనెటికల్ గా తల్లి, తండ్రి తానే అయిన ఏకైక వ్యక్తిగా డయారా రికార్డు సృష్టిస్తుంది. 

ఇప్పటికే డయారా ఇటీవలే రష్యాకు చెందిన వైద్య యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దీంతో గుజరాత్ రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ గా రికార్డ్ సృష్టించారామె.