గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు సోమవారం నాడు మళ్లీ అరెస్ట్ చేశారు. మోడీపై ట్వీట్ల కేసులో బెయిల్ మంజూరైన వెంటనే  బార్ పేట పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. National Political news

గాంధీనగర్:ప్రధాని Narendra Modi పై చేసిన ట్వీట్ల కేసులో Assam లోని కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత గుజరాత్ కు చెందిన Congress ఎమ్మెల్యే Jignesh Mevani ని మరో కేసులో అరెస్టు చేశారు పోలీసులు. మేవానీ బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు నిన్న రిజర్వ్ చేసింది. ఇవాళ మేవానీకి కోర్టు bail మంజూరు చేసింది. 

అసోంలోని బార్పేట పోలీసులు మేవానీని మరోసారి అరెస్ట్ చేశారు.బార్‌పేట పోలీసులు ఆయనపై నమోదైన కేసులో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మేవానీ తరపు న్యాయవాది అంగ్‌ష్ మాన్బోరా చెప్పారు. మేవానీపై ఐపీసీ 294,354, 353 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించకుండా నిరోధించేందుకు ప్రయత్నించారని మేవానీపై కేసు నమోదైంది. ఇది పూర్తిగా తప్పుడు కల్పిత కేసు అని బోరా చెప్పారు. మంగళవారం నాడు మేవానీని బార్పేట జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చనున్నారు. మేవానీకి బెయిల్ కోసం తాను కూడా బార్పేట వెళ్తామని ఆయన చెప్పారు. ఈ విషయమై అసోం కు చెందిన పోలీస్ ఉన్నతాధికార్లకు తాను ఫోన్ చేసినా కూడా సరైన సమాధానం రాలేదన్నారు. బార్పేట్ పోలీసులు అరెస్ట్ వారెంట్ తో వచ్చారన్నారు. పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదని బోరా వివరించారు.Barpeta రోడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ అంశంపై తాను వ్యాఖ్యానించలేనని స్టేషన్ ఇంచార్జీ అధికారి చెప్పారు.

గత సెప్టెంబర్ లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మేవానీని మూడు రోజుల తర్వాత ఆదివారం నాడు కోక్రాజార్ జిల్లా చీఫ్ జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అయితే మేవానీ బెయిల్ పిటిషన్ పై కోర్టు ఇవాళ తీర్పును ఇచ్చింది. మేవానీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా సీనియర్ పోలీస్ అధికారి కోరారు. మేవానీపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది బోరా వాదించారు.

అసోంలోని KOKRAJHAR కు చెందిన స్థానిక BJP నేత ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు మేవానీని ఈ నెల 21న అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని పాలన్ పూర్ వద్ద ఆయనను అరెస్ట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పన్ని తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మేవానీ ఆరోపించారు. రోహితో వేముల, చంద్రశేఖర్ ఆజార్ ను ఏ రకంగా క్రమ పద్దతిలో టార్గెట్ చేశారో ప్రస్తుతం తనను లక్ష్యంగా చేసుకొన్నారని జిగ్రేష్ మేవానీ సోమవారం నాడు మీడియాకు చెప్పారు.

ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా మేవానీ ట్వీట్లు ఉన్నాయని అసోం బీజేపీ నేత అరూప్ కుమార్ డే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ పిర్యాదు ఆధారంగా మేవానీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.