గాంధీనగర్: వివాహేతర సంబంధం ఓ నిండు గర్భిణీ ప్రాణాలు తీసింది. భర్తకు దూరంగా ఉంటున్న వివాహితకు అండగా ఉంటానని నమ్మించిన వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.  ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

గుజరాత్ రాష్ట్రంలోని బర్దోలీకి చెందిన మహిళ రష్మీ కటారియా భర్తకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. ఆమెకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

భర్తకు దూరంగా ఉంటున్న ఆమెపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్నేశాడు. ఆమెకు అండగా ఉంటానని చిరాగ్ పటేల్ ఆమెను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన రష్మీ అతనితో కలిసి ఉండేందుకు అంగీకరించింది.

గత ఆదివారం నాడు మూడేళ్ల కొడుకును తల్లి ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయింది.  అలా వెళ్లిపోయిన ఆమె తిరిగి రాలేదు.  ఈ విషయమై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులకు రష్మీ కుటుంబసభ్యులు చిరాగ్ పై అనుమానం వ్యక్తం చేశారు.

చిరాగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో పోలీసులకు అతను అసలు విషయాన్ని చెప్పాడు.  తమ ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే హత్య చేసినట్టుగా అతను పోలీసులకు చెప్పారు.  ఫాంహౌస్ లో రష్మీ మృతదేహాన్ని పూడ్చినట్టుగా ఆయన చెప్పారు. 

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఫాంహౌస్ లో రష్మీ మృతదేహాన్ని వెలికితీశారు.మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. చిరాగ్ కు పెళ్లై బార్య కూడా ఉంది. అయినా కూడ రష్మీతో సహజీవనం మొదలుపెట్టాడు. ఈ విషయమై చిరాగ్ కు ఆయన భార్యకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో రష్మీని హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఆయన ఒప్పుకొన్నాడు.