Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. రోజుల శిశువు నోట్లో మట్టి.. ఒంటిపై 20 కత్తిగాట్లు

క్రికెట్ ఆడుకోవడానికి కొందరు చిన్నారులు వెళ్లారు. అక్కడ వారికి ఓ పసికందు ఏడుస్తున్నట్లుగా అనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా... మూడు రోజుల చిన్నారి కనిపించింది.  ఆ చిన్నారిని కుక్కలు పీక్కుతినాలని చూస్తుండటం గమనార్హం.

Gujarat horror: 3-day-old girl found with 20 stab wounds in Rajkot
Author
Hyderabad, First Published Feb 28, 2020, 11:43 AM IST


పుట్టి కనీసం కొద్ది గంటలు కూడా గడవలేదు. అప్పుడే రోడ్డుపై పడేశారు. నోట్లు మట్టి పోసి రోడ్డు మీద వదిలేశారు. ఆ పసికందుని చూసి మాంసపు ముద్దగా భావించిన కుక్కలు.. పీక్కుతినడానికి ప్రయత్నించాయి. అయితే.. కొందరు చిన్నారులు గమనించి ఆ పసికందు ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన  గుజరాత్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ లోని మాహిక్, తెబచాడా గ్రామాల మధ్యలో క్రికెట్ ఆడుకోవడానికి కొందరు చిన్నారులు వెళ్లారు. అక్కడ వారికి ఓ పసికందు ఏడుస్తున్నట్లుగా అనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా... మూడు రోజుల చిన్నారి కనిపించింది.  ఆ చిన్నారిని కుక్కలు పీక్కుతినాలని చూస్తుండటం గమనార్హం.

Also Read అశ్లీల వీడియోలపై మోజు... 600 మంది కేసులు, అరెస్ట్..?

వెంటనే ఆ చిన్నారులు కుక్కలను తరిమికొట్టి ఆ పసికందు ని రక్షించారు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే.. ఆ చిన్నారి శరీరం మీద దాదాపు 20కత్తిగాట్లు ఉన్నాయని వారు చెప్పడం గమనార్హం. ఆ పసికందును చంపాలని ప్రయత్నించి చంపేలేక.. నోట్లో మట్టి పోసి అక్కడ పడేసినట్లు గుర్తించారు.

 కాగా.. చిన్నారికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడమని.. ప్రస్తుతం ఆ చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఆ పసికందుని అక్కడ ఎవరు వదిలేసారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు  కూడా చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios