Asianet News TeluguAsianet News Telugu

తెలివి ప్రదర్శిస్తున్నారా?... మోర్బీ విషాదం మీద గుజరాత్ హైకోర్టు సీరియస్...

గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటన మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మోర్బీ మున్సిపాలిటీని తెలివి ప్రదర్శిస్తున్నారా? అని అసహనం వ్యక్తం చేసింది. 

Gujarat High Court is serious about Morbi tragedy
Author
First Published Nov 15, 2022, 2:46 PM IST

గుజరాత్ : గుజరాత్ మోర్బీ కేబుల్ దుర్ఘటనపై మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టిన.. గుజరాత్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. బ్రిడ్జి పునరుద్ధరణ కాంట్రాక్ట్ ను కుబేర కంపెనీకి కట్టబెట్టిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మోర్బీ మున్సిపాలిటీ.. అజంతా బ్రాండ్ వాల్ క్లాక్ లు తయారుచేసే  ఒరేవా గ్రూప్ నకు 15 ఏళ్ల పాటు వేలాడే వంతెన కాంట్రాక్టు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకుటెండర్లు ఎందుకు వేయలేదని, అసలెందుకు టెండర్లు ఆహ్వానించలేదు? అని ప్రధాన న్యాయమూర్తి  అరవింద్ కుమార్, గుజరాత్ చీఫ్ సెక్రటరీనీ  ప్రశ్నించారు.

ప్రభుత్వ విభాగమైన మున్సిపాలిటీ తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే 135 మంది మరణించారు. అసలు ఈ ఒప్పందం 1963 గుజరాత్ మున్సిపాలిటీస్ చట్టానికి లోబడి ఇదంతా జరిగిందా? అనే   గుజరాత్ హైకోర్టు ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యాఖ్యానించింది. గుజరాత్ హైకోర్టు మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశ్ తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం  విచారణ చేపట్టింది. ఈ మేరకు  ఆరు ప్రభుత్వ విభాగాల నుంచి  వివరణ కోరింది ధర్మాసనం.

భారత్ జోడో యాత్ర ఓట్ల కోసం కాదు.. దాని లక్ష్యం రాజకీయాలకు అతీతమైనది - జై రాం రమేష్..

 అయితే, మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులు ఎవరు ఈ విచారణకు హాజరుకాలేదు, ఇక నోటీసులు అందుకున్నప్పటికీ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బెంచ్. తెలివి ప్రదర్శిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంతెన ప్రారంభానికి ముందు దాని ఫిట్నెస్ను ధృవీకరించడానికి ఏదైనా షరతు ఒప్పందంలో భాగమేనా?, అసలు ధ్రువీకరించడానికి  బాధ్యత వహించే వ్యక్తి ఎవరు? అనేదానిపై సమాధానాలతో తిరిగి రావాలని అధికారులను గట్టిగా మందలించింది.

Follow Us:
Download App:
  • android
  • ios