అహ్మదాబాద్: కరుడుగట్టిన ముఠాకు చెందిన అక్బర్ అలియాస్ లూలో సంధి అనే వ్యక్తిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.గుజరాత్ రాష్ట్రానికి చెందిన విరమంగానికి చెందిన వాసవ గ్రామానికి చెందినవాడని పోలీసులు చెప్పారు.

ఈ గ్యాంగ్‌పై రెండు సామూహిక అత్యాచారాల కేసులున్నాయని ఇంచార్జీ క్రైమ్ డీసీపీ  రాజ్‌‌దీప్సిన్ జాలా చెప్పారు. ఈ గ్యాంగ్ లో ముగ్గురు సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా చెప్పారు.

ఈ ముఠా మహిళలపై వాళ్ల పార్ట్‌నర్స్‌ ముందే అత్యాచారానికి పాల్పడేవారని చెప్పారు. అరెస్టైన నిందితుడికి రెండు గ్యాంగ్ రేప్ ఘటనకు చెందిన కేసుల్లో సంబంధం ఉందని చెప్పారు. ఓ యువతితో పాటు మరో గృహిణిపై ఈ నిందితులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు.ఈ ముఠా మహిళలపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా వారిపై ఉన్న ఆభరణాలను దోచుకొన్నారని పోలీసులు తెలిపారు.