Asianet News TeluguAsianet News Telugu

 డ్రగ్స్ పై గుజరాత్ ఉక్కు పాదం.. గతేడాది కాలంలో రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం!   

గత ఏడాది కాలంలో గుజరాత్ పోలీసులు రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, దాదాపు 750 మందిని జైలుకు తరలించారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో వెల్లడించింది.

Gujarat Govt Tells  Cops Seized Drugs Worth Rs 6,500 Crore in One Year
Author
First Published Sep 22, 2022, 1:18 AM IST

గత ఏడాది కాలంలో గుజరాత్ పోలీసులు రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, దాదాపు 750 మందిని జైలుకు తరలించారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో వెల్లడించింది.బుధవారం అసెంబ్లీలో డ్రగ్స్ వ్యవహారంపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సమయంలో గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘ్వీ..  ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఈ విషయంలో రాజకీయాలు ఆపాలని కోరారు. ఇది పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని సంఘ్వీ అన్నారు.

ఇటీవల.. గుజరాత్ పోలీసులు కోటి రూపాయల విలువైన డ్రగ్స్ విక్రయించిన సలీం అనే ముంబై నివాసిని పట్టుకున్నారు. అలాగే ఆ వ్యక్తికి పాకిస్థాన్‌లోని డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు గురించారనీ, ఆ డ్రగ్ డీలర్ పాక్ నుంచే డ్రగ్స్‌ను కొనుగోలు చేసేవాడని పోలీసులు గురించారని మంత్రి హర్ష్‌ సంఘ్వీ తెలిపారు. మహారాష్ట్రలో 2020లో ఎవరి ప్రభుత్వం ఉందనీ, అతన్ని పట్టుకోవడంలో మహారాష్ట్ర పోలీసులు  విఫలమయ్యారని, చివరకు గుజరాత్ పోలీసులు అతన్ని పట్టుకున్నారని సంఘవి చెప్పారు.మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని హోంశాఖ మంత్రి సభకు తెలిపారు. 

చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు సుఖ్‌రామ్ రథ్వా డ్రగ్స్ సమస్యపై బిజెపి ప్రభుత్వంపై దాడి చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నేరాన్ని GCTOC చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఎవరైనా ఏ మతానికి చెందిన దేవతలను అగౌరవపరిచినా కఠిన చట్టం ప్రకారం విచారించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్ అన్నారు. 2002 బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదును తగ్గించిన తరువాత గత నెలలో విడుదలైన 11 మంది దోషులను వీలైనంత త్వరగా తిరిగి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రగ్స్ ను గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంత్రి తెలిపారు. పాకిస్థాన్‌తో సముద్ర సరిహద్దు సమీపంలోని బోట్ల నుంచి కూడా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.రాష్ట్ర పోలీసులు గత ఏడాది కాలంలో 6,500 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారనీ, అదే సమయంలో డ్రగ్స్ అక్రమ చేస్తున్న 750 మంది డ్రగ్స్ స్మగ్లర్లను కటకటాల వెనక్కి పంపినట్టు తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. దక్షిణ సూడాన్‌కు చెందిన ఇరవై ఐదేళ్ల యువకుడిని బుధవారం మంగళూరులో అరెస్టు చేశారు. జూన్‌లో నగరంలో నలుగురికి మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ (ఎండీఎంఏ) విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. జూన్ 15న పాడిల్‌లో 125 గ్రాముల ఎండిఎంఎ డిగ్‌లను తీసుకెళ్తున్న నలుగురిని అరెస్టు చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నిషేధిత డ్రగ్‌ను ఓ విదేశీయులు తమకు విక్రయించినట్లు పోలీసులకు సమాచారం అందింది. 

నలుగురిపై పోలీసులు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దక్షిణ సూడాన్‌లోని జుబాలో నివసిస్తున్న లుయెల్ డేనియల్ జస్టిన్ బౌలో అలియాస్ డానీ అనే విదేశీ పౌరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios