Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల వేళ గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం .. యునిఫాం సివిల్‌ కోడ్‌ అమలుకు ముందడుగు

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కమిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కేబినెట్‌కి ఇదే చివరి సమావేశం అని భావిస్తున్నారు, వచ్చే వారం రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Gujarat Government's Big Move On Uniform Civil Code Ahead Of Polls
Author
First Published Oct 30, 2022, 3:52 AM IST

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల్లో సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కమిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కేబినెట్‌కి ఇదే చివరి సమావేశం అని భావిస్తున్నారు. వచ్చే వారం రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ఈ నిర్ణయం గురించి మీడియాకు వివరించారు.

గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని సిఎం భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో ఏకరూప పౌర కోడ్‌ను అమలు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయాలని. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కమిటీలో చేర్చే వ్యక్తులను ఇంకా ప్రకటించాల్సి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌరులందరికీ ఒకే విధమైన చట్టాన్ని వర్తింపజేయాలని రాజ్యాంగంలోని క్లాజ్ IVలోని ఆర్టికల్ 44 నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘ్వీ తెలిపారు. ఇది ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ చరిత్రాత్మక నిర్ణయం అని సంఘ్వీ అన్నారు. 

ఈ కమిటీకి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ముగ్గురు నుంచి నలుగురు సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. కమిటీ సభ్యులను ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు మంత్రివర్గం అధికారం ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి కోడ్ ఉండాలనే సామాన్య ప్రజలతో పాటు బీజేపీ కార్యకర్తల అభీష్టామని, ఆ అభీష్టాన్నీతమ ప్రభుత్వం గౌరవించిందని అన్నారు. ప్రతిపాదిత యూసీసీ రాజ్యాంగం కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించదని రూపాలా నొక్కి చెప్పారు. హిందూ వివాహ చట్టం, ముస్లిం పర్సనల్‌ చట్టాలు రాజ్యాంగంలో భాగం కావని యూసీసీ పరిధిలోకి వస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు.

రూపాలా ఇంకా మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక హక్కులను హరించాలనే ఉద్దేశం మాకు లేదు. యూసీసీ భర్త లేదా తండ్రి ఆస్తిపై భార్య లేదా కుమార్తె యొక్క దావాల వంటి పౌర వివాదాలలో తలెత్తే వ్యత్యాసాలను పరిష్కరించడంలో కూడా వ్యవహరిస్తుంది. అటువంటి సమస్యలకు సంబంధించి మేము ప్రజల నుండి చాలా ప్రాతినిధ్యాలను స్వీకరించాము." అని తెలిపారు.

యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం ద్వారా ప్రజలందరికీ సమాన హక్కులు లభిస్తాయన్నారు. ఈ నిర్ణయానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని, యూసీసీ హామీ ఇచ్చి హిందూ ఓట్లను పోలరైజ్ చేసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన తోసిపుచ్చారు. యూసీసీకి సంబంధించిన పలు అంశాలను కమిటీ మూల్యాంకనం చేసి నివేదికను అందజేస్తుందని, దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందని రూపాలా చెప్పారు. కమిటీ తన నివేదికను సమర్పించేందుకు ఇంకా ఎలాంటి కాలపరిమితిని నిర్ణయించలేదన్నారు. గతంలో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తున్నట్టు ప్రకటించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios