వన్యప్రాణి సంరక్షణకు గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని గిర్ నేషనల్ పార్కులో సింహాలను ఆకతాయిలు ఎడిపించడం.. వాటితో ఫోటోలు దిగడం.. వేటాడుతుండటంతో ఆసియాటిక్ సింహాలతో ఫోటోలు దిగడం మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాగే వదిలేస్తూ పోతే ఈ జాతి సింహాల ఉనికికే ప్రమాదమని గ్రహించిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై సింహాలు కనిపిస్తే వాటిని ఫోటోలు తీస్తే కఠినంగా శిక్షిస్తామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా సింహాలను ప్రదర్శించే కార్యక్రమాలు ఏర్పాటు చేసినా.. వాటిని వెంబడించినా అటవీ సంరక్షణ చట్టం 1978 కింద ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని పేర్కొంది. వీటితో పాటుగా సింహాలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన నాలుగు విభాగాలు ఇకపై ఒకే విభాగంగా పనిచేస్తుందని తెలిపింది.. సో... గుజరాత్‌లో ఉన్న వారు.. ఆ రాష్ట్రానికి వెళుతున్న వారు సింహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.