గుజరాత్: విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌పై గుజరాత్ సీఎం  విజయ్ రూపానీ ప్రశంసలు కురిపించారు. భారీ వరదల్లో చిక్కుకొన్న ఇద్దరు చిన్నారులను తన భుజాలపై మోసుకొంటూ కానిస్టేబుల్ పృథ్వీసింగ్ జడేజా వెళ్లిన  దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

కానిస్టేబుల్ పృథ్వీరాజ్‌సింగ్  జడేజా చూపిన ధైర్య సాహసాలకు దేశం మొత్తం ఆయనను అభినందిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ సింగ్ జడేజా ఓ ఉదహరణగా నిలుస్తారని సీఎం విజయ్ రూపానీ అభిప్రాయపడ్డారు.

భుజాలలోతు వరకు ఉన్న నీటిలో ఇద్దరు చిన్నారులను మోసుకొంటూ కానిస్టేబుల్ పృథ్వీరాజ్ సింగ్ జడేజా ఒడ్డుకు చేరారు. పృథ్వీరాజ్ సింగ్ చౌహన్ చిన్నారులను ఒడ్డుకు చేర్చే దృశ్యాలను అక్కడే ఉన్న మరో వ్యక్తి తన మొబైలో చిత్రీకరించాడు.