గుజరాత్ మళ్లీ బీజేపీదే.. పీపుల్స్ పోల్స్ ,ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్..!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆత్మసాక్షి,పీపుల్స్ పోల్స్ ఎగ్టిట్ పోల్ అంచనా వేసింది. అయితే బీజేపీ 128-148 స్థానాలు సాధించి గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకుంటుందని తెలిపింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆత్మసాక్షి,పీపుల్స్ పోల్స్ ఎగ్టిట్ పోల్ ఎగ్టిట్ పోల్ అంచనా వేసింది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్‌లో అధికారం దక్కించుకోవాలంటే.. 92 మెజారిటీ మార్క్‌ను సాధించాల్సి ఉంటుంది.
ఆత్మసాక్షి సర్వే ప్రకారం.. బీజేపీ 98-110 స్థానాలు సాధించి గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ 66-71 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అంతగా ప్రభావం చూపకపోవచ్చని పేర్కొంది. ఆప్ కేవలం 9-14
స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది.
పీపుల్స్ పోల్స్ సర్వే ప్రకారం.. బీజేపీ 125-143 స్థానాలు సాధించి గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ 30-48 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది.ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 3-7 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది.
ఆత్మసాక్షి సర్వే ప్రకారం
బీజేజీ : 98-110
కాంగ్రెస్: 66-71
ఆప్ : 9-14
పీపుల్స్ పోల్స్ సర్వే ప్రకారం
బీజేపీ : 125 - 143
కాంగ్రెస్:30-48
ఆప్ :3-7
రిపబ్లిక్ సర్వే ప్రకారం..
బీజేపీ: 128- 148
కాంగ్రెస్: 30- 42
ఆప్ :2-10
స్వతంత్రులు:0- 3
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 27 ఏళ్లుగా గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక, మొదటి విడతలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో సౌరాష్ట్ర, కచ్, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా మొత్తం 39 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. 89 అసెంబ్లీ స్థానాల బరిలో మొత్తం 788 మంది అభ్యర్థులు నిలిచారు. మొదటి దశలో మొత్తం ఓటింగ్ శాతం 63.14గా నమోదు కాగా..
రెండో దశ మొత్తం ఓటింగ్ శాతం 59 శాతం నమోదు అయిందని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 92 సీట్లు అవసరం.
గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. గుజరాత్‌లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్, ఆప్‌లు కూడా బీజేపీకి గట్టి పోటీనిస్తున్నాయి. మోదీ బీజేపీ తరపున భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకుని గుజరాత్ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు. ఆప్ అభ్యర్థుల తరపున కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.