Asianet News TeluguAsianet News Telugu

గుజ‌రాత్ ఎన్నిక‌లు: ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేస్తూ మూడు గంట‌ల పాటు ప్ర‌ధాని మోడీ మెగా రోడ్ షో

Ahmedabad: ప్రధాని మోడీ గురువారం అహ్మదాబాద్‌లో 5 నియోజకవర్గాలను కవర్ చేస్తూ మూడు గంటల మెగా రోడ్‌షో నిర్వహించనున్నారు. ఉత్తర గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని కలోల్ నుండి ప్రారంభిస్తారు. వెజల్‌పూర్ గ్రామంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండో ఎన్నికల ర్యాలీ ఛోటా ఉదయ్‌పూర్‌లోని బోడెలిలో జరగనుంది.
 

Gujarat Elections: PM Modi's three-hour road show covering five constituencies
Author
First Published Dec 1, 2022, 1:58 AM IST

Gujarat Assembly Elections: గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్రచారం సాగిస్తున్నాయి. మొద‌టి ద‌శ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసంది. నేడు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.  అయితే, రెండో ద‌శ ఎన్నిక‌ల స‌మ‌యం సైతం త‌క్కువ‌గా ఉండ‌టంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తును కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గురువారం నాడు అహ్మదాబాద్‌లో 5 నియోజకవర్గాలను కవర్ చేస్తూ మూడుగంటల మెగా రోడ్‌షో నిర్వహించనున్నారు. ఉత్తర గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని కలోల్ నుండి ప్రారంభిస్తారు. వెజల్‌పూర్ గ్రామంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండో ఎన్నికల ర్యాలీ ఛోటా ఉదయ్‌పూర్‌లోని బోడెలిలో జరగనుంది.

అహ్మదాబాద్‌లోని ఐదు నియోజకవర్గాల్లో 28 కిలోమీటర్ల మేర మూడుగంటల పాటు ప్ర‌ధాని మెగా రోడ్‌షో నిర్వహించనున్నారు. మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ, రాష్ట్రంలో గురువారం ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 5న రెండో దశ పోలింగ్ కు ముందు ఎన్నిక‌ల‌ ప్రచారం జోరుగా సాగుతోంది. రెండో విడత ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గురువారం గుజరాత్‌లో మూడు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉత్తర గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని కలోల్ నుండి ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీని ప్రారంభిస్తారు.  వెజల్‌పూర్ గ్రామంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండో ఎన్నికల ర్యాలీ ఛోటా ఉదయ్‌పూర్‌లోని బోడెలిలో జరగనుంది. మధ్యాహ్నం సబర్‌కాంత జిల్లాలోని హిమ్మత్‌నగర్‌లో మూడో బహిరంగ సభ జరగనుంది. మరుసటి రోజు ప్ర‌ధాని మోడీకి నాలుగు ఎన్నిక‌ల‌ ర్యాలీలు ఉన్నాయి.  అవి  కనకరాజ్, తర్వాత పటాన్, సోజిత్రా, చివరిది అహ్మదాబాద్ లో నిర్వ‌హించ‌నున్నారు.

కాగా, నవంబర్ 20న సోమనాథ్‌ను సందర్శించడంతో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే, ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే అనేక ప్రభుత్వ కార్యక్రమాల కోసం రాష్ట్రానికి వచ్చారు. ఇక‌ గురువారం గుజరాత్‌లో తొలి దశ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.  తొలి దశలో గుజరాత్‌లోని 182 స్థానాలకు గాను 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలి దశలో సౌరాష్ట్రలోని 54, దక్షిణ గుజరాత్‌లోని 35 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 5న రెండో దశలో 93 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పాటు గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

 

కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనాయకులు గుజరాత్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గుజరాత్ లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందనీ, ప్రజలు తమకు సంపూర్ణ మద్దతు ఇస్తారని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios