Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ఎన్నికలు 2022: 13 మంది అభ్యర్థులతో ఆప్ 7వ జాబితా విడుద‌ల.. ఇవిరాలు ఇవిగో

Aam Aadmi Party (AAP): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022  కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) 13 మంది అభ్యర్థులతో  కూడిన ఏడో జాబితాను విడుదల చేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రంలో అధికార‌పీఠం ద‌క్కించుకోవాల‌ని ఆప్ ముమ్మ‌రంగా ప్రచారం చేస్తోంది.
 

Gujarat Elections 2022: AAP releases 7th list with 13 candidates; Here are these
Author
First Published Oct 28, 2022, 3:21 PM IST

Gujarat Assembly Election 2022:  గుజ‌రాత్ అసెంబ్లీకి త్వ‌ర‌లోనే ఎన్నాక‌లు జ‌ర‌గున్నాయి. రాష్ట్రంలో అధికారం నిల‌బెట్టుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆమ్ ఆద్మీ (ఆప్), కాంగ్రెస్ పార్టీలు ఎలాగైన ఈ ఎన్నిక‌ల్లో జ‌య‌కేతనం ఎగుర‌వేసి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చేస్తున్నాయి. ముమ్మ‌రంగా ప్ర‌చారం కొర‌సాగిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ.. ఆప్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతోంది. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి ఆప్ పాలిత రాష్ట్రాల న‌మూనాల‌ను ప్ర‌స్తావిస్తోంది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ప‌క్కావ్యూహాల‌తో సిద్ధ‌మ‌వుతున్న ఆప్.. ఇదివ‌ర‌కే ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలబెట్టే ప‌లువురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. తాజాగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే 13 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన 7వ జాబితాను ఆప్ విడుద‌ల చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల 2022 కోసం 13 మంది అభ్యర్థులతో ఏడవ జాబితాను శుక్ర‌వారం నాడు విడుదల చేసింది. వారిలో కడి నుంచి హెచ్ కె దభీ, గాంధీనగర్ నార్త్ నుంచి ముఖేష్ పటేల్, వాద్వాన్ నుంచి హితేష్ పటేల్ బజరంగ్, మోర్బీ నుంచి పంకజ్ రాన్సారియా, జస్దాన్ నుంచి తేజస్ గజీపారా, జెట్ పూర్ (పోర్ బందర్) నుంచి రోహిత్ భువా, కలవాడ్ నుంచి డాక్టర్ జిగ్నేష్ సోలంకి, జామ్ నగర్ రూరల్ నుంచి ప్రకాశ్ డోంగా, మెహమ్మదాబాద్ నుంచి ప్రమోద్ భాయ్ చౌహాన్, లునావాడ నుంచి నట్వర్ సిన్హ్ సోలంకి పోటీ పడుతున్నారు. అలాగే, సంఖేడా నుంచి రంజన్ తాడ్వి, మాండ్వి (బార్డోలీ) నుంచి సయనాబెన్ గమిత్, మహువా (బార్డోలీ)కు చెందిన కుంజన్ పటేల్ దోధియాల‌ను ఆప్ పోటీలోకి దింపుతోంది.

 

ఇప్పటివరకు ఆప్ గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే మొత్తం 86 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. అంతకుముందు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ 20 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను విడుదల చేసింది. ఆరో జాబితాలో సంత్రంపూర్ నుంచి పర్వత్ వాగోడియా, దాహోద్ నుంచి దినేశ్ మునియా, మంజల్‌పూర్ నుంచి విరల్ పంచల్, సూరత్ నార్త్ నుంచి మహేంద్ర నవాదియా, డాంగ్ నుంచి సునీత్ గమిత్, వల్సాద్ నుంచి రాజు మార్చాలకు ఆప్ టికెట్లు ఇచ్చింది. అలాగే, రాపర్ నుండి అంబాభాయ్ పటేల్, వడ్గామ్ నుండి దల్పత్ భాటియా, మెహసానా నుండి భగత్ పటేల్, విజాపూర్ నుండి చిరాగ్‌భాయ్ పటేల్, భిలోడా నుండి రూపసిన్ భగోడా, బయాద్ నుండి చున్నీభాయ్ పటేల్, ప్రంతీజ్ నుండి అల్పేష్ పటేల్, ఘట్లోడియా నుండి విజయ్ పటేల్, ఘట్లోడియా నుండి విజయ్ పటేల్‌, చేత‌న్ గ‌జేరాను జునాగఢ్ నుంచి, విశ్వదర్ నుండి భూపత్ భయానీని ఆప్ పోటీలో దింపుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios