Asianet News TeluguAsianet News Telugu

గత రికార్డులను బద్దలు కొడుతూ.. అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ.. కలిసొచ్చిన అంశాలేంటీ?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. 2017 ఎన్నికల కంటే 57 సీట్లు అధికంగా గెలుచుకొని బంపర్ విక్టరీని కైవసం చేసుకుంది. ఈ సారి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్- ఆప్ చతికిలపడ్డాయి.  

Gujarat Election Result 2022: How BJP scored a landslide victory
Author
First Published Dec 8, 2022, 6:02 PM IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. 2017 ఎన్నికల కంటే 57 సీట్లు అధికంగా గెలుచుకొని బంపర్ విక్టరీని కైవసం చేసుకుంది. ఈ సారి గుజరాత్‌లో బీజేపీ-కాంగ్రెస్- ఆప్ ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని, గతంలో కంటే.. బీజేపీకి సీట్లు పడిపోవచ్చని విశ్లేషకులు భావించారు. కానీ..మోడీ చరిష్మా ముందు ప్రతిపక్షాలు పత్తా లేకుండా పోయాయి. ప్రధానంగా దూకుడు వ్యవహరించిన ఆప్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేవలం 5 సీట్లకే పరిమితమైంది. బీజేపీ అఖండ విజయంలో ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు కొన్నైతే.. దూకుడుగా వ్యవహరించిన ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో మరింత నష్టం వాటిల్లింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఉన్న రికార్డులను తిరగరాసింది. 1985లో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 149 సీట్లు గెలుచుకుంది.. ఇది ఇప్పటి వరకు ఇదే రికార్డు. 1995 నుంచి అధికారంలో ఉన్నట్టున్న బీజేపీ  2002లో నరేంద్ర మోదీ హయాంలో అత్యధికంగా  127  సీట్లు సాధించింది. ఇదే బీజేపీ అల్ టైం రికార్డు.. కానీ నేడు వెలువడిన ఫలితాలు గత రికార్డులను బద్దలు కొట్లాయి. బీజేపీ ఏకంగా 157 స్థానాల్లోవిజయం సాధించింది. రాష్ట్రంలో అప్రఖ్యాతియతంగా బీజేపీ వరుసగా 7వసారి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీజేపీకి ఓట్లు వేసి పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆ మాటను గుజరాత్ ప్రజలు నిలబెట్టారు.

తొలుత దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన ఆప్..క్రమంగా ఎదుగుతు వెళ్తుంది. అనంతరం పంజాబ్ అధికారాన్ని చేపట్టింది. గోవాలో చెప్పుకోదగిన ఓట్లను సాధించిన ఆప్. అదే ఊపులో గుజరాత్‌లో చక్రం తిప్పాలని ప్రయత్నించింది. ఖచ్చితంగా బీజేపీ కంచుకోటలో ఆప్ అధికారం చేపడుతుందని  పార్టీ చీఫ్ కేజ్రివాల్ ప్రకటించారు.బీజేపీ పంతంలోనే నడిచింది. ప్రధానంగా  హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి హామీల వర్షాన్ని గుప్పించారు.అనేక ఉచిత హామీలను, వాగ్దానాలను ఇచ్చారు. కానీ,, ఇవ్వాళ వెలువడుతున్న ఫలితాలను గమనిస్తే..  ఆప్ సింగిల్ డిజిట్‌తో  సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆప్ భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చిందని చెప్పాలి. ఇక ఆప్‌తో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలకు గండి కొట్టారనీ చెప్పాలి. పరోక్షంగా  బీజేపీ గెలుపుకు ఇవి సహకరించాయనే చెప్పాలి.


ఈ క్రమంలో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ తో ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అధికార బీజేపీ వ్యతిరేకత శక్తులను ఎలా అధిగమించి ఘనవిజయం సాధించిందో వివరించారు.

గుజరాత్ లో బీజేపీ ఆఖండ విజయంపై  ఆశిష్ రంజన్, ఎన్నికల విశ్లేషకుడు  తన అభిప్రాయాన్ని ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ తో పంచుకున్నారు. మాధవ్ సింగ్ సోలంకి హాయంంలో సాధించిన 149 మార్కును బీజేపీ బ్రేక్ చేసింది. అలాగే..భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ వరుసగా ఏడుసార్లు అధికారాన్ని గెలుచుకోవడం  ఇదే తొలిసారని ఆశిష్ రంజన్, ఎన్నికల విశ్లేషకుడు తెలిపారు. ఆయన విశ్లేషణ ప్రకారం..  

ఎ) ఓట్లు చీలిపోవడం 

ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని కైవసం చేసుకుంది. ఆప్ పోటీ చేయకుంటే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయేదని కాదు కానీ, ఓట్ల శాతాన్ని చూస్తే.. గత ఎన్నికల కంటే బీజేపీకి దాదాపు ఐదు శాతం ఎక్కువ వచ్చాయి. కాబట్టి బీజేపీదే విజేత. ఓట్ల చీలిక, బీజేపీ అఖండ విజయం సాధించడంలో ఆప్ దోహదపడిందని పేర్కొన్నారు. 

బి) మోడీ మానియా..

దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆదరణ తగ్గలేదు. అతని ప్రజాదరణ చాలా ఎక్కువ. ఆయన ప్రధానమంత్రి అయినా.. ఆయన పేరు మీద గుజరాత్ ప్రజలు ఓటేశారు. ఫలితాలను పరిశీలిస్తే,, అహ్మదాబాద్, సూరత్, వడోదరలో ఆయన రోడ్‌షోలు నిర్వహించిన ప్రతిచోటా ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు

గుజరాత్ లో బీజేపీ ఆఖండ విజయంపై  డాక్టర్ అశుతోష్ సింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ గారు తన అభిప్రాయాలను ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ తో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "ప్రధాని మోడీకి ఇప్పటికీ ప్రజాదరణ చెక్కుచెదరలేదని, ఆయన పక్కన ఎవరూ నిలబడలేదని గుజరాత్ పోరు మరోసారి నిరూపించింది.సమీప భవిష్యత్తులో ఎలాంటి మార్పు ఉండదని తాను అనుకోననీ, ఆయన గుజరాత్‌లో తిరుగులేని నంబర్ 1 నాయకుడిగా మిగిలిపోతారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వెలువడుతాయని తెలిపారు. కానీ, ఢిల్లీ MCD ఎన్నికలలో బీజేపీ ఓడిపోతుందని అనుకోలేదు" అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios