ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. కానీ.. ఆ గర్భాన్ని ఉంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. దీంతో... ఓ వైద్యుడి సహాయంతో అబార్షన్ చేయించేసుకుంది. కాగా.. ఆ వైద్యుడు బాలికకు అబార్షన్ చేసి తర్వాత.. పిండాన్ని తన వెంటే కారులో తీసుకువెళ్లాడు. కొద్ది దూరం వెళ్లాక కారులో నుంచి పిండాన్ని బయటకు విసిరేశాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కి చెందిన ఓ మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరియం కాస్త ప్రేమగా మారింది. కాగా... ప్రేమ ముసుగులో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాలిక.. ఆ అవాంఛిత గర్భాన్ని తీసేయించుకోవాలని అనుకుంది. దీంతో.. ఓ డాక్టర్ ని సంప్రదించింది. బాలికతో ఆ డాక్టర్ ఒప్పందం కుదుర్చుకొని మరీ అబార్షన్ చేశాడు  ఈ అబార్షన్ చేసినందుకుగానూ సదరు బాలిక వద్ద రూ.15వేలు తీసుకున్నాడట ఈ డాక్టర్. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

 సదరు డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అక్రమంగా అబార్షన్ చేసినందుకు వైద్యుడిని అరెస్టు చేశారు. అలాగే బాలిక గర్భానికి కారణమైన ఓ 19ఏళ్ల కుర్రాడిని కూడా పట్టుకున్నారు. అతనిపై అత్యాచారంతోపాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.