Asianet News TeluguAsianet News Telugu

భర్త వీర్యం కావాలని కోర్టు కెక్కిన భార్య.. సేకరించిన కాసేపటికే మృతి... !

కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని మృతుడి భార్య తరఫు న్యాయవాది తెలిపారు.  ఐవిఎఫ్ పద్ధతిలో పిల్లలను కంటానని ఆ మహిళ తెలపగా, ఆ విధానానికి అనుమతి ఇవ్వడం మీద తదుపరి విచారణ శుక్రవారం జరగాల్సి ఉంది.

Gujarat : COVID-19 patient dies day after hospital collects his sperm as per HC order - bsb
Author
Hyderabad, First Published Jul 24, 2021, 4:01 PM IST

అహ్మదాబాద్ : కరోనా సోకి చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని కోర్టుకెక్కిన భార్య భర్త గుర్తుంది కదా.. అయితే, కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే అతను ప్రాణాలు వదిలాడు. 

అయితే, కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని మృతుడి భార్య తరఫు న్యాయవాది తెలిపారు.  ఐవిఎఫ్ పద్ధతిలో పిల్లలను కంటానని ఆ మహిళ తెలపగా, ఆ విధానానికి అనుమతి ఇవ్వడం మీద తదుపరి విచారణ శుక్రవారం జరగాల్సి ఉంది.

‘నా భర్త వీర్యం కావాలి’... కోర్టు కెక్కిన భార్య.. !

వివరాల ప్రకారం.. కోర్టు అనుమతి పొందాక ఆసుపత్రి సిబ్బంది తన క్లయింట్ భర్త వీర్యాన్ని సేకరించారని, ఆ తర్వాత అతడు గురువారం కన్నుమూశారని మహిళ తరఫు న్యాయవాది చెప్పారు. కాగా గుజరాత్ కు చెందిన దంపతులకు సంతానం లేదు. ఇటీవల సదరు మహిళ భర్త కరోనా కారణంగా పలు అవయవాలు దెబ్బతిని స్టీర్లింగ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు పరిస్థితి ఉందని వైద్యులు చూసుకునేందుకు బిడ్డను కంటానని,  అందుకు భర్త వీర్యం కావాలని ఆమె కోరింది.

అయితే ఐవీఎఫ్ కోసం అతని స్పెర్మ్ సేకరించాలని, అందుకు కోర్టు అనుమతి ఉండాలని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. వైద్యుల అభిప్రాయం ప్రకారం తన భర్త బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పిటిషన్లో విన్నవించింది ఈ నేపథ్యంలో సదరు ఆ రోగి ఆరోగ్య పరిస్థితిని మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకుని అత్యవసర అనుమతులు జారీ చేసింది. కానీ,  వీర్యం సేకరించిన కొన్ని గంటల్లోనే మృతి చెందిన విషాదకరం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios