దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.

దీంతో మాస్క్‌లు ధరించని వారికి విధిస్తున్న జరిమానాల విషయంలో వివిధ రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. మాస్క్ లేకుండా బయటకు వస్తున్న వారిపై ప్రభుత్వాలు భారీగా జరిమానాలు విధిస్తుండటంతో... దీని ద్వారా ఖజానాలకు కాసుల పంట పండుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు జరిమానాలు విధించడంలో గుజరాత్ అధికారులు ఇతర రాష్ట్రాల కంటే కాస్త ముందున్నారు.
మాస్క్‌లు ధరించని వారి నుంచి 2020 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబరు వరకు వసూలు చేసిన సొమ్ము రూ.168 కోట్లు. గుజరాత్ శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ వివరాలను వెల్లడించారు.
అయితే 2020 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన జరిమానా వివరాలను మాత్రం సీఎం వెల్లడించలేదు. అయితే ఓ అంచనా ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు జరిమానాల రూపంలో వసూలు చేసిన సొమ్ము దాదాపు రూ.308 కోట్లు ఉండవచ్చునని తెలుస్తోంది.
మాస్క్ నిబంధనను పాటించని 16,78,922 మంది నుంచి 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రూ.168 కోట్లు వసూలు చేసినట్లు విజయ్ రూపానీ తెలిపారు. మొదట్లో రూ.200 జరిమానాగా వసూలు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత దీనిని రూ.500కు, తర్వాత రూ.1,000కి పెంచినట్లు సీఎం చెప్పారు.