గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా సోకింది.ఆదివారం నాడు అనారోగ్యంతోనే ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలోనే ఆయన కళ్లు తిరిగి పడిపోయాడు. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించారు.

యుఎస్ మెహతా ఆసుపత్రిలో విజయ్ రూపానీని చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.ఈ చికిత్సలో కరోనా సోకినట్టుగా తేలింది. అయితే సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.

సీఎం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ తరుణంలో ఎన్నికల సభలో సీఎం పాల్గొన్నారు. విజయ్ రూపానీని 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు ప్రకటించారు.