బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై కండక్టర్,డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు.ఈ దారుణ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మహిళ ఒంటరిగా ఉండటాన్ని అవకాశంగా తీసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కుక్సీ పట్టణానికి చెందని ఓ వివాహిత ఒంటరిగా పోర్  బందర్ నగరానికి వచ్చేందుకు ప్రైవేటు లగ్జరీ బస్సు ఎక్కింది. బస్సు ఛోటా ఉదయపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చేరుకునే సరికి  రాత్రి 9గంటలు అయ్యింది.

Also read ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు పిసికి చంపిన భార్య..

దీంతో.. బస్సులోని ప్రయాణికులంతా భోజనాలు చేయడానికి కిందుకు దిగారు. ఆ సమయంలో.. ఆమె ఒంటరిగా ఉండటాన్ని చూసి డ్రైవర్, కండక్టర్ అవకాశంగా తీసుకున్నారు.  బస్సులో పడుకునేందుకు స్థలం చూపిస్తామంటూ బస్సు డ్రైవరు నన్న‌ాభాయ్, కండక్టర్ కపిల్‌లు వివాహితను బస్సు పైకి తీసుకువెళ్లి ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. 

అనంతరం బాధిత వివాహిత అదే బస్సులో పోర్‌బందర్ నగరానికి చేరింది. పోర్‌బందర్‌లో మేనల్లుడి సహాయంతో బాధిత వివాహిత అత్యాచార ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బస్సు ఆపి  డ్రైవరు నన్న‌ాభాయ్, కండక్టర్ కపిల్‌ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు.