Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ బ్రిడ్జీ కూలిపోవడం దైవేచ్ఛనే.. : కోర్టులో వంతెన మెయింటెనెన్స్ కంపెనీ మేనేజర్.. డీఎస్పీ ఏమన్నారంటే?

గుజరాత్ తీగల వంతెన కూలిపోవడాన్ని దైవేచ్ఛగా పేర్కొంటూ ఈ బ్రిడ్జీ రిపేర్ వర్క్ చేపట్టిన కంపెనీ మేనేజర్ కోర్టులో విస్మయకర వ్యాఖ్యలు చేశారు. భగవంతుడి ఇచ్ఛతోనే ఇది జరిగిందని చెబుతూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ, అదే కోర్టులో డీఎస్పీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి.
 

gujarat bridge collapse is will of god says oreva company manager in court
Author
First Published Nov 2, 2022, 12:59 PM IST

అహ్మదాబాద్: గుజరాత్‌లో తీగల బ్రిడ్జీ కూలిపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వంతెన మెయింటెనెన్స్ పర్యవేక్షించాల్సిన కంపెనీ ఒరెవా మేనేజర్ ఈ రోజు కోర్టులో విస్మయకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన దైవేచ్ఛ ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జీని రిపేర్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఆదివారం ఈ వంతెన కూలిపోయిన తర్వాత పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అందులో సెక్యూరిటీ గార్డు, టికెట్ కౌంటర్‌ సిబ్బంది సహా ఒరెవా కంపెనీ మేనేజర్ దీపక్ పరేఖ్ కూడా ఉన్నారు.

ఈ ఘటన గురించి చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఎంజే ఖాన్ వాదనలు విన్నారు. ఇందులో ఒరెవా మేనేజర్ దీపక్ పరేఖ్ మాట్లాడారు. ఇది భగవంతుడి ఇచ్ఛ అని తెలిపారు. అందువల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించారు. కాగా, మోర్బి డిప్యూటీ ఎస్పీ పీ ఝాలా కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జీ రెనోవేట్ చేసినప్పుడు తుప్పు పట్టిన కేబుళ్లను మార్చలేదని, వాటిని అలాగే ఉంచిందని ఆరోపించారు.

Also Read: తక్కువ లోతులో నీరు, నది అడుగులో రాళ్లే ప్రాణ నష్టానికి కారణం.. గుజరాత్ బ్రిడ్జి విషాదంపై ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్

ఈ కేబుల్ బ్రిడ్జీని అక్టోబర్ 26న ప్రభుత్వ అనుమతి లేకుండా.. క్వాలిటీ టెస్ట్ చేయకుండానే రీఓపెన్ చేశారు.

‘మెయింటెనెన్స్, రిపేర్‌లో భాగంగా వీరు కేవలం బ్రిడ్జీ ప్లాట్‌ఫామ్ మాత్రమే మార్చారు. ఆ బ్రిడ్జీ మొత్తంగా తీగలపైనే ఆధారపడి ఉన్నది. అలాంటి ఆ తీగలకు ఆయిల్, గ్రీస్ పెట్టడం వంటివి చేయలేదు. ఈ కేబుల్ విరిగిన దగ్గర చూస్తే.. అవి తుప్పు పట్టి ఉన్నాయి. ఈ కేబుల్‌ను రిపేర్ చేసి ఉంటే.. ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు’ అని పోలీసు అధికారి కోర్టులో తెలిపారు.

అసలు ప్రభుత్వ మౌలిక వసతులను రిపేర్ చేసే అర్హతే ఈ కాంట్రాక్టర్లకు లేదని ఓ ప్రాసిక్యూటర్‌కు కోర్టుకు తెలిపారు. అయినా, వారే రిపేర్ చేశారని వివరించారు. వీరికి అర్హత లేకున్నా 2007లో మళ్లీ 2022లో వీరికే ఈ కాంట్రాక్టు ఇచ్చారని చెప్పారు.

ఈ సారి రిపేర్ చేసినప్పుడు బ్రిడ్జీ ఫ్లోరింగ్ కొత్తది వేయడంతో మరింత బరువు పెరిగింది. నాలుగు పొరల అల్యూమినియం షీట్లను ఈ ఫ్లోరింగ్ కోసం వినియోగించారు. కేబుల్స్‌ను పట్టించుకోకుండా ఈ ఫ్లోరింగ్ వేయడం వల్ల ప్రమాదం జరిగింది.

ఈ బ్రిడ్జీ రెనోవేషన్ పూర్తయిన తర్వాత కనీసం మరో 8 నుంచి 10 ఏళ్ల వరకు ఈ బ్రిడ్జీ ఏ ఆటంకం లేకుండా ఉంటుందని ఒరెవా మేనేజింగ్ డైరెక్టర్ జయసుఖ్‌బయ్ పటేల్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆయన కనిపించలేదు. చివరి సారి ఈ బ్రిడ్జీ రీఓపెనింగ్ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా కనిపించారు.

Also Read: మోర్బీ బ్రిడ్జీ ఘటనతో అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్.. 2,109 వంతెనల ఫిట్ నెస్ ను పరీక్షించాలని మమతా సర్కార్ ప్లాన్

అహ్మదాబాద్‌లోని ఒరెవా ఫామ్ హౌజ్‌కు తాళం వేసి వదిలిపెట్టబడి ఉన్నది. ఒరెవా టాప్ బాస్‌ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొనలేదు. ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన మోర్బి మున్సిపల్ అధికారుల పేర్లూ లేవు.

ఒరెవా గ్రూప్ మరో మేనేజర్ దీపక్ పరేఖ్, ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లు శనివారం వరకు పోలీసు కస్టడీలో ఉంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios