Congress Manifesto: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ స్టేడియం పేరు మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను అధికారిక పత్రంగా స్వీకరిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. 

Gujarat Assembly Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను అధికారిక పత్రంగా స్వీకరిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మ‌రింత‌గా మాట్లాడుతూ.. స్టేడియం పేరు మార్చడమే కాకుండా రూ.3 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామనీ, పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేస్తామని గ్రాండ్ ఓల్డ్ పార్టీ హామీ ఇచ్చింది. "మా ప్రభుత్వం ఏర్పడితే మొదటి మంత్రివర్గంలో ఈ మేనిఫెస్టో ప్రభుత్వ పత్రంగా మారుతుంది" అని గెహ్లాట్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. "మేనిఫెస్టోలో ఏమి ఉండాలో ప్రజలను అడగాలని రాహుల్ గాంధీ మాకు చెప్పినట్లు పేర్కొన్న ఆయ‌న‌.. దీని కోసం ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ముందుకు వచ్చారు" అని గెహ్లాట్ తెలిపారు. పని కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్ కాకుండా ప్రజల ఎంపిక మేరకు పార్టీ ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసిందని రాజస్థాన్ సీఎం చెప్పారు. 3,000 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, గుజరాత్‌లోని బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 

రాజస్థాన్ సీఎం విడుదల చేసిన 'జన్ ఘోషణ పాత్ర' మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎనిమిది హామీలను కేంద్రంగా కొన‌సాగింది. కాంగ్రెస్ అధికారిక ట్విటర్ పేజీలో “గుజరాత్ ప్రజలు విద్య, ఆరోగ్య సంరక్షణ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అనుమతించరు. అందరం కలిసి మార్పు తీసుకువద్దాం” అని పేర్కొంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి వాగ్దానాలు ఉన్నాయి. "గుజరాత్ యువత గౌరవప్రదంగా జీవించడానికి సహాయం చేయడానికి, ఖాళీగా ఉన్న 10 లక్షల ప్రభుత్వ స్థానాలకు కాంగ్రెస్ నియామకం చేస్తుంది" అని కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొంది. అలాగే జనతా మెడికల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా పాత పెన్షన్ విధానాన్ని కాంగ్రెస్ అమలు చేస్తాని పేర్కొంది. 

Scroll to load tweet…

కరోనా కారణంగా బంధువులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనుందని తెలిపింది. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్, పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత, “గుజరాత్‌లో తాము 125 సీట్లకు పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని” అన్నారు. పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రాజస్థాన్ సీఎం మాట్లాడుతూ “ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల హామీ మేనిఫెస్టో. మేనిఫెస్టోకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా ఎన్నికల తర్వాత మేనిఫెస్టో వాగ్దానాలను మర్చిపోతున్నారు” అని అన్నారు. “మేనిఫెస్టోలో ఏమి ఉండాలో ప్రజలను అడగాలని రాహుల్ గాంధీ మాకు చెప్పారు. గతంలో కమిటీ ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ సూచనల తర్వాత మేనిఫెస్టోలో ఏమి ఉండాలనే దానిపై ప్రజలను అడిగాము” అని తెలిపారు. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నిలబడద‌నీ, గుజ‌రాత్ ప్రజలు ఆప్ ను అంగీకరించర‌ని ఆయ‌న పేర్కొన్నారు.