ట్రక్కును ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే నలుగురు మృతి
Banaskantha: గుజరాత్‌లోని బనస్కాంతలో ఘోర ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Gujarat road accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ రోడ్డు ప్రమాదం గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్ లోని బనస్కాంతలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఒక కారు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత హైవేపై భారీ పొడవునా ట్రాఫిక్ జామ్ ఉంది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం గురించి అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సంతాల్పూర్-పాలన్పూర్ హైవేపై రణక్పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తారా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ దేశాయ్ తెలిపారు. బాధితులు తారా నుండి వారి స్వగ్రామానికి వెళుతున్నారని చెప్పారు. కారు వెనుక నుండి ట్రైలర్ ను ఢీకొట్టిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రామచంద్ర వాఘేలా, యోగేంద్ర వాఘేలా, శివరాజ్ సింగ్ వాఘేలా, భావిక్ షాగా గుర్తించారు.
టీ దుకాణంలోకి దూసుకొచ్చిన బొలెరో వాహనం..
గుజరాత్ లోని జరిగిన మరో ఘటనలో ఒక టీ దుకాణంలోకి బొలెరో వాహనం దూసుకువచ్చింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్ లోని ఒక టీ దుకాణంలోకి అదుపుతప్పి వేగంగా వచ్చిన బొలెరో వాహనం దూసుకొచ్చింది. ఆ ప్రమాదం శనివారం రాత్రి జరిగిందనీ, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
దేశంలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు..
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 2020లో 13 శాతం తగ్గిన తర్వాత 2021లో మళ్లీ పెరిగింది. 2021లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య గత ఐదేళ్లలో అత్యధికంగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2021లో ఉత్తరప్రదేశ్, తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. 2021లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 153,972 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన 2020లో, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 131,714గా ఉంది. ఇది 2019, 2018, 2017లో వరుసగా 151113, 151417, 147,913 మరణాలతో పోలిస్తే తక్కువ అని కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు సమాధానం ఇచ్చారు.
2021లో ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 21,227 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 15,384, మహారాష్ట్రలో 13,528, మధ్యప్రదేశ్ లో 12,057, కర్ణాటకలో 10,038, ఆంధ్రప్రదేశ్ లో 8,186, బీహార్ లో 7,660, తెలంగాణలో 7,557, గుజరాత్ లో 7,557 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.