గుజరాత్‌లోని  పంచమహల్  సమీపంలోని ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పది మందితో  ప్రయాణీస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లగా  ఈ ప్రమాదం  చోటుచేసుకొంది.


గాంధీనగర్: గుజరాత్‌లోని పంచమహల్ సమీపంలోని ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పది మందితో ప్రయాణీస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

కారు కాలువలోకి దూసుకెళ్లిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని రక్షించేలోపుగా కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ముగ్గురిని మాత్రమే స్థానికులు రక్షించారు. ఈ కారులో ఉన్న ఏడుగురు కారులోనే ఉన్నారు. 

కారుతో సహా 7 చిన్నారులు కాలువలోనే మునిగిపోయారు. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. మృతులంతా ఏడు నుండి 16 ఏళ్ల వయస్సులోపువారే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.