న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ పేరును సబర్ కంత జిల్లాలోని ఓ తాలూకా కోర్టు ఆదేశించింది.

2002లో చోటు చేసుకొన్న గుజరాత్ అల్లర్ల బాధితులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  ఈ కేసులో నరేంద్ర మోడీ నుండి తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేనందున.. ఈ పిటిషన్ల నుండి ఆయన పేరును తొలగిస్తున్నట్టుగా కోర్టు ప్రకటించింది.ముస్లింల తరపున బ్రిటిష్ దేశానికి చెందిన శిరిన్ దావూద్, షరీనా దావూద్ లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమ కుటుంబ సభ్యుల మరణానికి కారణమైన మోడీ నుండి రూ. 24 కోట్లు పరిహారం ఇప్పించాలని  పిటిషన్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసింది. అల్లర్లకు మోడీ కారణమని చెప్పలేమని... ఆయన పేరును తొలగిస్తున్నట్టుగా కోర్టు ప్రకటించింది.

2002 ఫిబ్రవరి 28వ తేదీన బ్రిటీష్ జాతీయుడు ఇమ్రాన్ దావూద్... తన మేనమామలు సయీద్ దావూద్, షకీల్ దావూద్, మహ్మద్ అస్వాత్లతో కలిసి ఇండియాకు వచ్చారు.

ఆగ్రా, జైపూర్ తిరిగి తమ స్వగ్రామం లజ్జాపూర్ కు టాటా సుమోలో వస్తున్న సమయంలో ఆందోళనకారులు ఈ  టాటా సుమోను దగ్ధం చేశారు.సయీద్, ఆశ్వత్ తో పాటు గుజరాత్ కు చెందిన డ్రైవర్ యూసుఫ్ పిరాఘర్  మరణించారు. మరో వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆయన చనిపోయినట్టుగా అనుమానిస్తున్నారు.