Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ: గిన్నిస్ రికార్డు స్వంతం చేసుకున్న బెంగుళూరు సంస్థ

ప్రపంచంలోని  అత్యంత పొడవైన  దోశను తయారు చేసింది కర్ణాటకకు చెందిన ఓ ఫుడ్ సంస్థ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Guinness record created for Worlds longest dosa by 75 chefs after 110 failed attempts lns
Author
First Published Mar 20, 2024, 6:45 AM IST

బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రంలోని  బెంగుళూరులో  గిన్నిస్ రికార్డు నమోదైంది. బెంగుళూరులోని ఓ ఫుడ్ సంస్థ  ప్రపంచంలోని  అతి పొడవైన దోశ తయారు చేసి ఈ రికార్డును స్వంతం చేసుకున్నారు.

తమ సంస్థ  100వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి  ఈ భారీ దోశను తయారు చేశారు. తమ సంస్థకు వచ్చే వారు చూసేలా ఈ భారీ దోశను ఏర్పాటు చేశారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ఈ దోశ తయారీకి సంబందించిన వీడియోను చెఫ్ రెజీ మాథ్యూ షేర్ చేశారు. దోశ తయారీలో పలువురు చెఫ్ లు పాల్గొన్నారు. ఫుడ్ సంస్థలోని 123 అడుగుల భారీ దోసె తయారు చేశారు.

 

ప్రపంచంలో అతి పొడవైన దోశ తయారీ చేసిన  నిర్వాహకులకు గిన్నిస్ సర్టిఫికెట్ అందించారు.ఈ వీడియోలో ఈ దృశ్యాలున్నాయి. 123 అడుగుల పొడవున్న  దోశను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థను ఆ సంస్థ సాధించింది.ఈ నెల 15న ఈ దోశను తయారు చేశారు. ఈ దోశ తయారీ కోసం  110 దఫాలు ప్రయత్నించారు.  అయితే చివరికి  ఈ దోశ తయారీలో  విజయవంతమయ్యారు.

ఈ దోశకు తయారీ వీడియోను రెండు రోజుల క్రితం  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే  24 వేల మంది వీక్షించారు.  అంతేకాదు ఈ వీడియోను  వెయ్యి మంది లైక్ చేశారు. అంతేకాదు పలువురు నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేశారు.

అభినందనలు..రెజీ.. అద్భుతమైన విజయమని  ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.  వావ్.. అభినందనలు.. చెఫ్ రెగి మీ బృందానికి అని మరొకరు చెప్పారు.ఇది అద్భుతమని మరొక నెటిజన్  అభిప్రాయపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios