కరోనా కష్టకాలంలో ఆదాయాలు లేక అన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ.... ఆదాయ రాబడి మాత్రం రాష్ట్రాలకు ఇంకా పెరగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కేంద్రం ఇచ్చే జీఎస్టీ బకాయిలపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. 

కానీ కేంద్రం ఈ విషయంలో బాంబు పేల్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మూ డేళ్ల తర్వాత మొదటిసారి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించేందుకు నిధులు లేవని కేంద్రం అంగీకరించింది. 

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే ఇదే విషయాన్ని ప్రకటించారు. జయంత్‌ సిన్హా ఆధ్వర్యంలోని ఆర్థిక శాఖ పార్లమెంటరీ కమిటీ ముందు ఆర్ధిక శాఖా కార్యదర్శి వెల్లడించారు. 

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, జీఎస్టీ చట్టంలోని ప్రస్తుత ఆదాయ పంపిణీ విధానం ప్రకారం రా ష్ట్రాలకు పరిహారం చెల్లించే స్థితిలో కేంద్రం లేదని, దీంతో పార్లమెంటరీ కమిటీలోని ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆగ్ర హం కూడా వ్యక్తం చేసారు కూడా. 

2017 జూలై నుంచి దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం రాష్ట్రాలు తమ ఆదాయాన్ని కోల్పోయినట్టయితే కేంద్రం ఆ మేరకు పరిహారం చెల్లించాల్సిన విషయం విదితమే. 

రాష్ట్రాలు తమ రాబడిలో వార్షికంగా 14 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోకపోతే కేంద్రం తప్పనిసరిగా ఆమేరకు పరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని కమిటీలో ఇతర పార్టీ సభ్యులు అంటున్నారు. 

కరోనా దెబ్బకు రాష్ట్రాలు విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి. వైద్యం, సంక్షేమ పథకాల ఖర్చు అధికంగా ఉంటుంది. రాష్ట్రాలు ఈ స్థాయిలో ఖర్చు చేస్తుండడంతో.... ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపులకు చర్చించేందుకు జీఎస్టీ మండలి ప్రత్యేకంగా భేటీకానుంది. ఈ భేటీలో అయినా తమ పరిహారాలు తమకు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే బాగుందును అని కోరుకుంటున్నాయి.