జీఎస్టీ పరిహరం చెల్లింపులో  ఏజీ  సర్టిఫికెట్  సమర్పించని కారణంగా  కొన్ని రాష్ట్రాలకు  నిధులు విడుదల  చేయలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రా అకౌంటెంట్ జనరల్ సర్టిఫికెట్ ను సమర్పించకపోవడం వల్లే జీఎస్టీ పరిహరం చెల్లింపులో ఆలస్యమౌతుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సోమవారం నాడు లోక్ సభలో ఈ విషయమై కేంద్ర ార్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. 

2017-18 నుండి కేరళ రాష్ట్రం ఇంతవరకు అకౌంటెంట్ జనరల్ సర్టిఫికెట్ సమర్పించలేదని ఆమె చెప్పారు. 2022 మే 31 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహరం కింద రూ. 86, 912 కోట్లు విడుదల చేసినట్టుగా మంత్రి వివరించారు. 

జీఎస్టీ పరిహరం చెల్లింపును జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 

జీఎస్టీ పరిహరం చెల్లింపులో అకౌంటెంట్ జనరల్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే విషయం తెలుసునన్నారు. అకౌంటెంట్ జనరల్ సర్టిఫికెట్ పొందడంలో జాప్యం జరిగితే అది ఏజీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.. 

జీఎస్టీ పరిహరం పొండానికి చట్టం చెబుతున్న ప్రకారంగా రాష్ట్రాలు వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నొక్కి చెప్పారు. 2017-18, 2018-19,2019-20,2019-20,2020-21 ఆర్ధిక సంవత్సరాలకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏజీ సర్టిఫికెట్లు పంపలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఒక్క ఏజీ సర్టిఫికెట్ కూడా పంపకుండా జీఎస్టీ పరిహరం చెల్లింపు విషయమై కేంద్రాన్ని ప్రశ్నిస్తే ప్రయోజనం ఏమిటని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 2017-18 కి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఏజీ సర్టిఫికెట్ సమర్పించడంతో ఆ ఏడాది జీఎస్టీ పరిహరం చెల్లించినట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. 

2020-21 సంవత్సరానికి తమిళనాడు రాష్ట్రం నుండి ఏజీ రూ. 4,223 కోట్లకు సంబంధించి ఏజీ ధృవీకరించినట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. అయితే దీనిపై కొన్ని వివాదాలున్నాయన్నారు. అయినా కూడా దీన్ని ప్రాసెస్ చేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.