థానే: మహిళను ఎరగా వేసి బార్ కు రప్పించి ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఉల్హాస్ గనర్ లో జరిగింది. ఓ బార్ లో ఈ దారుణం మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. 

దీపక్ బోయిర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి మనేర్ గ్రామంలో నివసిస్తున్నాడు. కొన్ని మాసాల క్రితం నరేష్ చావన్ అనే వ్యక్తితో దీపక్ గొడవ పడ్డాడు. ఈ మహిళ విషయంలో ఆ గొడవ జరిగింది. ఇది పెట్టుకున్న చావన్ ప్రతీకారం కోసం పథక రచన చేశాడు.

తన పథకంలో భాగంగా ఓ మహిళ పేరుతో దీపక్ కు చావన్ ఫోన్ చేసి బార్ కు రావాలని చెప్పాడు.ఆ ట్రాప్ లో చిక్కుకున్న దీపక్, తన స్నేహితుడిని తీసుకుని మంగళవారం ఉదయం 1.30 గంటలకు డ్యాన్స్ బార్ కు వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బయటకు వచ్చాడు. 

అక్కడే కాచుకుని కూర్చున్న చావన్ ను, అతని మిత్రున్ని చుట్టుముట్టారు. కత్తులు తుపాకులు తీసి వారిపై దాడికి దిగారు. దీపక్, అతని మిత్రుడు తప్పించుకునేందుకు పరుగు తీశారు. అయితే, దీపక్ మధ్యలో జారి పడ్డాడు. దాంతో దీపక్ పై కత్తితో దాడి చేశారు. ఛాతీ, పొట్ట, వీపు భాగాల్లో 30 సార్లు కత్తితో పొడిచారు. దాంతో దీపక్ మరణించాడు.

ఆ విషయాన్ని దీపక్ మిత్రుడు అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో దీపక్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీపక్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు. చావన్ కక్షతో దీపక్ ను హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు.