శోభనం గదిలో ఉరివేసుకున్న వరుడు.. ఎంతకీ తలుపు తీయకపోవడంతో...
కొత్తగా పెళ్లైన ఓ వరుడు శోభనం గదిలో ఉరివేసుకుని చనిపోయిన విషాధ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో కొత్తగా పెళ్లయిన ఓ జంట విషయంలో జరిగిన దారుణం ఇప్పుడు అక్కడ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొత్త పెళ్లికొడుకు శోభనం గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. పాల గ్లాస్ తో లోపలికి వెళ్లాల్సిన వధువు షాక్ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… ఉత్తరప్రదేశ్లోని ఓ జంటకు కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ జంటకు తొలిరాత్రి ఏర్పాటు చేశారు. దీని కోసం సంప్రదాయం ప్రకారం అన్ని సిద్ధం చేశారు. వధూవరులను శోభనం గది వరకు తోడుకొని వెళ్లారు.
అక్కడికి వెళ్లిన తర్వాత.. ఒక్క నిమిషం అంటూ వధువును ఆపి వరుడు గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు.బాత్రూంకి వెళ్ళాడేమో అనుకున్న వధువు కాసేపటి వరకు ఎదురు చూసింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో.. తలుపులు తీయమంటూ కొట్టినప్పటికీ లోపల నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. గదిలో ఫ్యానుకు వేలాడుతూ వరుడు కనిపించాడు.
ముస్లిం మహిళలపై అభ్యంతరకర పోస్టు.. ఆరెస్సెస్ కార్యకర్త అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని కనౌజి జిల్లా మాచారియా గ్రామానికి చెందిన మనోజ్ యాదవ్ కు గోల్డీ అనే యువతీతో వివాహమయ్యింది. మే 26వ తేదీన వారి వివాహం వైభవంగా జరిగింది. మరుసటి రోజు భర్తతో కలిసి వధువు అత్తారింటికి వెళ్ళింది. మే 28వ తేదీన వారికి శోభనం ముహూర్తాన్ని నిశ్చయించారు. కుటుంబ సభ్యులు సంప్రదాయాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి.. రాత్రి పది గంటల వధువును శోభనం గది దగ్గర వదిలిపెట్టారు.
ఆ తర్వాత కాసేపటికి వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శోభనం గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతూ వరుడు కనిపించాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతను ఎందుకలా చేశాడో ఇప్పటికీ తెలియ రాలేదు. దీని మీద పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.