Asianet News TeluguAsianet News Telugu

నాలుగు రోజుల్లో పెళ్లి... ఎయిడ్స్ ఉందని చెప్పి...

వాస్తవానికి డిసెంబర్‌ 1న ఒక యువతితో నిందితుడు కిరణ్‌ కుమార్‌ వివాహం నిర్ణయం అయింది. కానీ పెళ్లికి మరో నాలుగు రోజులు ఉందనగానే నాటకీయంగా తనకు హెచ్‌ఐవీ సోకిందని అబద్ధం చెప్పి పెళ్లి నిలిచిపోయేలా చేశాడు. 

groom AIDS drama to call off  marriage in karnataka
Author
Hyderabad, First Published Dec 12, 2019, 8:37 AM IST

అప్పటికే నిశ్చితార్థం అయిపోయింది. ఇరు కుటుంబాల వారు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  కళ్యాణ మండం, క్యాటరింగ్ అన్నీ బుక్ చేసుకున్నారు. మరో నాలుగు రోజులో పెళ్లి... బంధు మిత్రుల ఆహ్వానాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక మండపంలో తాళి కట్టడమే తరువాయి అనుకున్న సమయంలో పెళ్లి కొడుకు బాంబు పేల్చాడు. తనకు ఎయిడ్స్ ఉందని చెప్పాడు. దీంతో... చేసేది లేక వధువు కుటుంబసభ్యులు పెళ్లి రద్దు చేశారు. అయితే... తీరా చూస్తే.... పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి వరుడు ఆడిన నాటకం అని తెలిసి అందరూ షాకయ్యారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...   వాస్తవానికి డిసెంబర్‌ 1న ఒక యువతితో నిందితుడు కిరణ్‌ కుమార్‌ వివాహం నిర్ణయం అయింది. కానీ పెళ్లికి మరో నాలుగు రోజులు ఉందనగానే నాటకీయంగా తనకు హెచ్‌ఐవీ సోకిందని అబద్ధం చెప్పి పెళ్లి నిలిచిపోయేలా చేశాడు. 

అయితే పెళ్లికి సదరు యువతి కుటుంబం సుమారు రూ. 15 లక్షల ఖర్చు చేసింది. దీంతో కిరణ్‌పై అనుమానంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు తీసుకున్న విజయనగర పోలీసులు.. కిరణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి హెచ్‌ఐవీ పరీక్ష చేయించారు. రిపోర్టు చూసి హెచ్‌ఐవీ లేదని నిర్ధారించుకున్నాక, యువతిని మోసం చేశాడనే ఆరోపణలపై విజయనగర పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios