టీ తోటలో గ్రెనేడ్లు, ఆయుధాలు.. భయాందోళనలో స్థానికులు..
అస్సాంలోని దిబ్రూగఢ్ లోని జలాన్ టీ గార్డెన్‌లో భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడ్డ ఆయుధాల నిల్వలో ఏకే-47 బుల్లెట్, రెండు బాటిల్ బాంబులు,పేలుడు పదార్థాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

అసోం రాష్ట్రం దిబ్రూగఢ్ జిల్లాలోని ఆయుధాలు, మందుగుండు కలకలం చెలారేగింది. ఓ టీ తోటలో నుంచి భారీ మొత్తంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ జలాన్ టీ ఎస్టేట్ లో చైనా తయారు చేసిన రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, ఏకే సిరీస్ రైఫిల్‌కు చెందిన రెండు మ్యాగజైన్‌లు, 12 కాట్రిడ్జ్‌లు, పిస్టల్ సైలెన్సర్ స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఇంటెలిజెన్స్ వర్గాల ఆధారంగా డిబ్రూగఢ్ పోలీసులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్)తో కలిసి జలాన్ టీ గార్డెన్‌లో ఆపరేషన్ ప్రారంభించారు. ఓ ప్యాకెట్‌లోని ఆయుధాల స్టాక్‌ను టీ తోటలో దాచారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పోలీసులు , సిఆర్‌పిఎఫ్ ఆపరేషన్ చేస్తుండగా డిబ్రూగఢ్ నగరం నడిబొడ్డున ఉన్న జలాన్ టీ గార్డెన్ నుండి ఆయుధాల కాష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డిబ్రూఘర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్వేతాంక్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో రెండు ఎకె మ్యాగజైన్లు, 12 రౌండ్ల బుల్లెట్లు, రెండు బాటిల్ గ్రెనేడ్లు, టైమర్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
పోలీసు ఆపరేషన్ కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఆయుధం పాతదని, విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. ఆయుధాన్ని టీ తోటలో ప్యాకెట్‌లో ఉంచారు. ఎగువ అస్సాంలో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యకలాపాలు పెరుగుతున్నాయని, కార్యకలాపాలను అరికట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని స్పెషల్ డిజిపి జిపి సింగ్ చెప్పారు. కాగా, కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, ఎలాంటి కార్యకలాపాలనైనా నిలువరించే సామర్థ్యం పోలీసులకు ఉందని స్పెషల్ డీజీపీ జీపీ సింగ్ తెలిపారు.
గంజాయి స్వాధీనం
అంతకుముందు బిస్వనాథ్ జిల్లాలో అస్సాం పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులను క్రిసింగ్ డైమరీ, నహు డైమరీగా గుర్తించారు. సుమారు 75 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహస్య సమాచారం ఆధారంగా, పోలీసు బృందం జముగురిహత్ బోర్పత్తర్ ప్రాంతంలో ఒక వాహనాన్ని వెంబడించి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.
ఈ ఘటనపై బిశ్వనాథ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ కులేంద్ర నాథ్ దేకా మాట్లాడుతూ.. "పోలీసు బృందం నిందితులను వెంబడించి పట్టుకుందని తెలిపారు. ఈ క్రమంలో నిందితుల నుంచి 75.20 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తమ విచారణ సాగుతోందని, దీనితో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ తాము పట్టుకుంటామని తెలిపారు.
చిరుతపులి దాడి.. ముగ్గురు అటవీ సిబ్బందితో సహా 13 మందికి గాయాలు
మరోవైపు సోమవారం నాడు జోర్హాట్ జిల్లాలో చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు అటవీ సిబ్బంది సహా కనీసం 13 మంది గాయపడ్డారు. ఈ మేరకు అటవీశాఖ అధికారి ఒకరు సమాచారం అందించారు. జిల్లాలోని చెనిజాన్ ప్రాంతంలోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ) ఆవరణలో ఉదయం నుంచి చిరుతపులి సంచరించింది. కాంప్లెక్స్‌లోని నివాసితులు అటవీశాఖకు సమాచారం అందించగా.. ఓ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని జంతువును పట్టుకుంది. ఆ ప్రాంతం నుండి పారిపోయే ముందు పులి కాంప్లెక్స్‌లోని 10 మంది నివాసితులు మరియు ముగ్గురు అటవీ సిబ్బందిపై దాడి చేసింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు.