Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రభుత్వం కోరుకుంటోంది: మాక్ డ్రిల్స్ మధ్య ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ‌

Delhi: క‌రోనావైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షోమ శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ తెలిపారు. భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య ఇంకా ఆందోళనక‌ర ప‌రిస్థితుల‌కు చేరుకోన‌ప్ప‌టికీ, చాలా దేశాల్లో కేసుల పెరుగుదలను చూస్తున్నాయి.
 

Govt wants to prevent spread of Covid: Health Minister Mansukh Mandaviya amid mock drills
Author
First Published Dec 27, 2022, 12:44 PM IST

Covid Mock Drills: ప్ర‌పంచవ్యాప్తంగా చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. చైనా, జ‌పాన్, అమెరికా, థాయ్ లాండ్ స‌హా చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ ఉద్ధృతి ప్ర‌పంచ దేశాల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఆయా దేశాల్లో వైర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మైన వేరియంట్ల‌లో ఒక‌టైన ఒమిక్రాన్ బీఎప్.7 వేరియంట్ కేసులు భార‌త్ లోనూ వెలుగుచూడ‌టం, ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన‌వారిలో ప‌లువురికి కోవిడ్-19 పాజిటివ్ రావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అలర్ట్ చేసింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.  చైనా సహా పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైన కేంద్ర ప్ర‌భుత్వం... వైరస్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే చ‌ర్య‌లు ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే మునుముందు క‌రోనా ఉద్ధృతితో దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగితే ఏర్ప‌డే ఎలాంటి ప‌రిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మంగళవారం మాక్ డ్రిల్ నిర్వ‌హిస్తోంది. 

క‌రోనా ప‌రిస్థితుల‌ను ఎదుర్కునేందుకు కేంద్రం సలహాను అనుసరించి.. దేశ‌రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆసుపత్రులలో నేడు  కోవిడ్-19 మాక్ డ్రిల్ కొన‌సాగుతోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌ మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో కోవిడ్ సంసిద్ధతను సమీక్షించారు.  వైరస్‌పై పోరాటంలో సంసిద్ధతను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా కసరత్తులు జ‌రిగాయ‌ని తెలిపారు. ప్రపంచవ్యాప్త కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా - మనం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని మంత్రి మీడియాతో అన్నారు. కాగా, నేడు దేశంలోని చాలా ప్రాంతాల్లో కొన‌సాగుతున్న క‌రోనా వైర‌స్ సంసిద్ధ‌త చ‌ర్య‌ల్లో (కోవిడ్ మాక్ డ్రిల్‌) వివిధ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య సౌకర్యాల లభ్యత, ఐసోలేషన్ బెడ్‌ల సామర్థ్యం, ​​ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్‌ పడకలు, వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, ఆయుష్ వైద్యుల లభ్యత వంటి ఇతర వనరులపై దృష్టి పెట్టాలని కేంద్రం ప్ర‌భుత్వం వివిధ రాష్ట్రాల‌కు రాసిన లేఖ‌లో కోరింది. వైద్య సిబ్బందితో పాటు ఆశా వ‌ర్క‌ర్లు, అంగన్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లను కూడా కోవిడ్ మాక్ డ్రిల్‌లో భాగం చెయ్యాలని కేంద్రం సూచించింది.

చైనాలో కొన‌సాగుతున్న కోవిడ్-19 కేసుల‌ ఉప్పెన ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గత వారం నుండి క‌రోనా వైర‌స్ ప‌రిస్థితుల‌పై వ‌రుస‌ సమావేశాలు నిర్వహించింది. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BF.7 ప్ర‌స్తుత కోవిడ్ ఉద్ధృతికి కార‌ణ‌మ‌నే అంచ‌నాల మ‌ధ్య భార‌త్ లోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై అంద‌రినీ హెచ్చ‌రించింది. కోవిడ్-19 మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని సూచించింది. ప్రస్తుత కోవిడ్-19 ఉప్పెనల మధ్య పొరుగు దేశ జనాభాలో దాదాపు 18 శాతం మంది ప్రభావితమైనట్లు అంచనా. "మేము కోవిడ్-19 సంసిద్ధతను నిర్ధారించుకోవాలి. రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా.. కోవిడ్ కేస్ లోడ్ ను పరిష్కరించడానికి ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సిద్ధంగా ఉన్న విధంగా, ఇతర ఆసుపత్రులు కూడా సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ప్రతిచోటా ప్రోటోకాల్‌ను పాటించేలా చూస్తున్నారు”అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ అన్నారు. ఈ డ్రిల్‌లో పాల్గొన్న తన ఫోటోలను కూడా ఆరోగ్య మంత్రి ట్విట్టర్‌లో పంచుకున్నారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios