కేంద్ర కేబినెట్ లో  స్వల్ప మార్పులు  చోటు  చేసుకున్నాయి.   న్యాయ శాఖను  కిరణ్ రిజుజు నుండి తొలగించారు. 

 న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. న్యాయశాఖను కిరణ్ రిజిజు నుండి తొలగించారు. న్యాయశాఖను అర్జున్ రామ్ మేఘవాలాకు అప్పగించారు.కిరణ్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖను కేటాయించారు.ఈ మేరకు ఇవాళ రాష్ట్రపతి భవనం నుండి ప్రకటన విడుదలైంది.

కిరణ్ రిజిజును న్యాయశాఖ నుండి తొలగించడంపై శివసేన స్పందించింది. పేర్లు ప్రస్తావించకుండా ఇటీవల వచ్చిన కోర్టు తీర్పుల గురించి ప్రస్తావించింది. ఈ కారణంగానే కిరణ్ ను న్యాయశాఖ నుండి తొలగించారా అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.

మరో వైపు కాంగ్రెస్ నేత అల్కా లాంబా కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టను కాపాడుకొనేందుకు రిజిజు నుండి న్యాయశాఖను తొలగించిందని ఆమె అభిప్రాయపడ్డారు.