రైతన్నలకు కేంద్రం శుభవార్త.. పీఎం కిసాన్ యోజన రూ. 8 వేలకు పెంపు ! 2023 బడ్జెట్‌లో ప్రకటన !!

కేంద్రప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Govt may increase PM KISAN installment money to Rs 8,000; announcement likely in Budget 2023

కేంద్రప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులకోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కొన్ని మినహాయింపులకు లోబడి, సాగు భూమితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూస్వాముల రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకవచ్చారు.

ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి రూ. 6000లను  మూడు (4-నెలలు) వాయిదాలలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమా చేయనున్నారు. ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన భాగంగా 12 వాయిదాల నగదును రైతులకు అందించగా.. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. జనవరి 23న రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున వేస్తారని సమాచారం. 

ఈ నిబంధనలను తప్పక పాటించాలి 

కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే.. తప్పనిసరిగా ఈ నాలుగు నిబంధనలను పాటించాలి.  ముందుగా రైతు భూమికి సంబంధించిన భూ రికార్డులో ఆ భూమికి రైతు యజమాని అని గుర్తించాలి. రెండవది PM కిసాన్ పోర్టల్‌లో రైతు e-KYC పూర్తి చేయాలి. మూడో షరతు ఏంటంటే.. రైతు బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయాలి. అదే సమయంలో నాల్గవ షరతు ఏమిటంటే.. బ్యాంక్ ఖాతాను కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి లింక్ చేయాలి. (PM కిసాన్ నియమాలు మార్చబడ్డాయి)ఈ నిబంధనలను పూర్తి చేయని వారు 13వ వాయిదాను పొందలేరు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పాటానికి సిద్ధమవుతోందట. పీఎం కిసాన్ నగదు 6000 వేల నుంచి మరింత పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ లో పీఎం కిసాన్ నగదును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. 

వివిధ జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక ప్రయోజనాన్ని రూ . 6 వేల నుండి రూ. 8వేలకి పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నాయి. రూ.8వేలను అర్హులైన రైతుల ఖాతాలో నాలుగు సమాన వాయిదాలలో అందించనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులను, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. 

PM-KISAN పథకం కింద ప్రయోజనాలను పొందడానికి ఎవరు అర్హులు?

భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాలు, వారి పేర్లపై సాగు చేయదగిన భూమి ఉన్నవారు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు.

PM-KISAN పథకం నుండి ఎవరు మినహాయించబడ్డారు?

ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన లబ్ధిదారుల కింది వర్గాలు పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదు.

ఎ. అన్ని సంస్థాగత భూమి హోల్డర్లు.

బి. కింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందిన రైతు కుటుంబాలు:

i) ప్రభుత్వ పదవులను కలిగి ఉన్నవారు. రిటైర్డ్ ఎంప్లాయిస్  

ii) మాజీ, ప్రస్తుత మంత్రులు/ రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ/ రాజ్యసభ/ రాష్ట్ర శాసనసభలు/ రాష్ట్ర శాసన మండలి మాజీ/ప్రస్తుత సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్‌ల మాజీ, ప్రస్తుత మేయర్‌లు, జిల్లా పంచాయతీల మాజీ, ప్రస్తుత అధ్యక్షులు.

iii) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు/డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులు. అలాగే.. ప్రభుత్వ ఫీల్డ్ యూనిట్‌లు కేంద్ర లేదా రాష్ట్ర PSEలు, అనుబంధ కార్యాలయాలు/ప్రభుత్వ పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థలు అలాగే స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు అన్ని సేవలందిస్తున్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులు
(మల్టీ టాస్కింగ్ స్టాఫ్/క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు మినహా)

vi) పై కేటగిరీకి చెందిన (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు మినహా) నెలవారీ పెన్షన్ రూ.10,000/- లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అన్ని సూపర్‌యాన్యుయేట్/రిటైర్డ్ పెన్షనర్లు

v) గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులందరూ

vi) వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకున్నారు. పై వృత్తుల్లో కొనసాగుతున్నవారు. అనర్హులు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios