పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, దానిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  నిషేధం విధించింది. అలాగే..  జమ్మూ కాశ్మీర్‌కు చెందిన, ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న ఎల్‌ఇటి కమాండర్ మహ్మద్ అమీన్ అలియాస్ అబు ఖుబైబ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఉగ్రవాదాన్ని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది, ఇందులో టీఆర్‌ఎఫ్ కార్యకలాపాలు భారతదేశ జాతీయ భద్రత , సార్వభౌమాధికారానికి విఘాతం కలిగిస్తాయి". ఉపా చట్టం కింద ఉగ్రవాదిగా పేర్కొనబడింది.

సోషల్ మీడియా వేదిక యువత రిక్రూట్‌మెంట్

లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థగా 2019లో ఉనికిలోకి వచ్చిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) రోజురోజుకు తీవ్రవాద కార్యకలాపాలు తీవ్రం చేస్తున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గురించాయి. ఆన్‌లైన్ మీడియాను ఉపయోగించి యువకులను రిక్రూట్ చేస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. టెర్రరిస్టు కార్యకలాపాల ప్రచారం, ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, టెర్రరిస్టుల చొరబాట్లు, పాకిస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో టీఆర్‌ఎఫ్ ప్రమేయం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. భారత రాజ్యానికి వ్యతిరేకంగా తీవ్రవాద సంస్థలలో చేరడానికి ప్రజలను ప్రేరేపిస్తుందని ఆరోపించింది.

నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా జమ్మూ కాశ్మీర్‌లోని భద్రతా దళ సిబ్బంది , అమాయక పౌరుల హత్యలకు ప్లాన్ చేసిన, ఆయుధాల స్మగ్లింగ్‌లో పాల్గొన్న TRF సభ్యులు, సహచరులపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా బలగాలపై ఉగ్రదాడులు, అమాయకులను హతమార్చిన ఘటనలను ప్రకటనలో పేర్కొంది.

మహ్మద్ అమీన్ ఖబాబ్ ఓ ఉగ్రవాది 

షేక్ సజ్జాద్ గుల్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ అని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ప్రకారం ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడని హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. TRF కార్యకలాపాలు భారతదేశ జాతీయ భద్రత , సార్వభౌమాధికారానికి విఘాతం కలిగిస్తాయనీ, అంతేకాకుండా.. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 ప్రకారం మహ్మద్ అమీన్ ఖబాబ్ అలియాస్ అబూ ఖుబాబ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించినట్టు తెలిపింది. 

Scroll to load tweet…
Scroll to load tweet…