Asianet News Telugu

మమత మరో సంచలనం.. గవర్నర్ అవినీతిపరుడంటూ ఫైర్..

తమ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికే ఆయన ఇటీవల ఉత్తర బెంగాల్ లో పర్యటించారని మండిపడ్డారు. 

Governor Jagdeep Dhankhar is a 'corrupt man', was named in 1996 Hawala Jain case : Mamata Banerjee  - bsb
Author
Hyderabad, First Published Jun 29, 2021, 11:38 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తమ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికే ఆయన ఇటీవల ఉత్తర బెంగాల్ లో పర్యటించారని మండిపడ్డారు. 

ఈ విషయం మీద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘గవర్నర్ ధన్ కర్ అవినీతి పరుడు. 1996 నాటి జైన్ హవాలా  కేసు చార్జీషీట్ లో ఆయన పేరు ఉంది. అవినీతి మకిలి అంటిన ఇలాంటి గవర్నర్ ను ఇంకా ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి’ అని మమత డిమాండ్ చేశారు. 

గవర్నర్ ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, అయినా స్పందించలేదని విమర్శించారు. దీనిమీ గవర్నర్ కూడా కౌంటర్ ఇచ్చారు.

సీఎం మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని గవర్నర్ ధన్ కర్ దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి తరహాలో మమత వ్యవహరించడం లేదన్నారు. 

వచ్చే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తాను చేయాల్సిన ప్రసంగంలోని కొన్ని అంశాల మీద అభ్యంతరాలు లేవనెత్తానని, అందుకే తనమీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైన్ హవాలా  కేసుకు సంబంధించిన ఏ  చార్జీషీట్ లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios