Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ సడలింపులు: ఎక్కడెక్కడ, ఎలా అంటే....

కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు మనం విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని మోడీ అన్నారు. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది దినసరి కూలీలు,  రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని అన్నారు. 

Government to Ease restrictions after april20, But the criterion to be met
Author
New Delhi, First Published Apr 14, 2020, 11:33 AM IST

దేశంలో కరోనాపై సాగుతున్న పోరులో భాగంగా మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశం చూపిన నియమ నిష్టలు ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శమయ్యాయని మోడీ తెలిపారు. 

కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు మనం విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని మోడీ అన్నారు. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది దినసరి కూలీలు,  రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని అన్నారు. 

నేటి నుండి  ఏప్రిల్ 20వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతోపాటుగా అధికారులు పరిస్థితులను సమీక్షిస్తారని, ఏ జిల్లాలవారీగా రోజు లెక్కలు కడతారని, ఏ జిల్లాలయితే కరోనా పై పోరులో ముందడుగును సాధిస్తాయో, అక్కడ కొత్త కేసులు నమోదవవొ, ఆ ప్రాంతాల్లో ఈ లాక్ డౌన్ కి కొన్ని మినహాయింపులను ఇచ్చే ఆస్కారం ఉందని ప్రధాని మోడీ అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న శుక్రవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ లాక్ డౌన్ విషయమై చర్చించారు. దాదాపుగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఈ లాక్ డౌన్ ని మరో రెండు వారాలపాటు పొడిగించాలని ప్రధానిని కోరాయి. ప్రధాని కూడా అందుకు అంగీకారం తెలిపారు. దీనికి అనుగుణంగానే మోడీ ఈ ప్రకటన చేసారని తెలియవస్తుంది. 

ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా మూసేయడం, ఆర్ధిక రాబడి ఆగిపోయింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతోపాటు ఎందరో కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడని వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొద్దీ మంది తిండి కోసం అలమటిస్తూనే ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ని కొనసాగిస్తూనే కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం  యోచించినట్టు తెలియవస్తుంది. ఈ మినహాయింపులను ఎక్కడెక్కడ ఎలా అమల్లోకి తేవాలి అని ప్రణాళికలో భాగంగా కలర్ కోడింగ్ ను ప్రవేశ పెట్టనున్నారు. దీనిపై  త్వరలో ఒక ప్రకటన చేయనున్నాయి. 

ట్రాఫిక్ సిగ్నల్ రంగుల మాదిరి రెడ్, గ్రీన్, ఆరంజ్ జోన్లుగా ప్రాంతాలను గుర్తించామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇదే విషయాన్నీ కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజతో సహా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వరకు అందరూ నొక్కి చెప్పారు. 

ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వని జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తారు. దేశమంతటా అట్లాంటి జిల్లాలు ఇప్పటివరకు 400 ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 

ఆరంజ్ జోన్లుగా 15 అంతకన్నా తక్కువ కేసులు నమోదై, కేసుల సంఖ్యా పెరగకుండా ఉన్న జిల్లాలను ఆరంజ్ జోన్లుగా గుర్తించనున్నారు. ఈ రెండు జోన్లలో వ్యవసాయ పనులకు మినహాయింపు ఇవ్వడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను కొద్దిగా, పరిమితులకు అనుగుణంగా  అందుబాటులోకి తేనున్నారు. 

15 అంతకన్నా ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తూ అక్కడ ఏ విధమైన మినహాయింపులు ఉండవు. సంపూర్ణ లాక్ డౌన్ అక్కడ కొనసాగుతుందని తెలియవస్తుంది. 

ఇలా ఆర్ధిక రంగ అవసరాన్ని నొక్కి చెబుతూ, తాను తొలిసారి లాక్ డౌన్ ప్రకటించేటప్పుడు మనం ఉంటె ప్రపంచం ఉంటుందని కాబట్టి తొలుత ప్రజల ప్రాణాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. మొన్నటి మీటింగ్ లో జీవితం ప్రపంచం రెంటిని కలిపి చూడాలని అన్నారు. 

కేవలం వ్యవసాయ రంగం ఒక్కటే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, భవన నిర్మాణ రంగం, పరిశ్రమలకు కూడా సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ పని చేసుకోవాలని చెబుతూ మినహాయింపులు  ఉందని తెలియవస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios