వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. షాస్టాగ్ విషయంలో మరొ సవరణ చేసింది. జనవరి 1, 2021 నుంచి దేశవ్యాప్తంగా వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్రం మరోసారి సవరించింది. ఫాస్టాగ్ గడువును ఫిబ్రవరి 15, 2021 వరకూ పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఫాస్టాగ్ ద్వారా ఇప్పటికే 75 నుంచి 78 శాతం టోల్ ట్యాక్స్ చెల్లింపులు జరుగుతుండటం గమనార్హం. 

ఫాస్టాగ్ విధానం ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల ప్రయాణికులు లైన్లలో ఆగి తమ సమయాన్ని, ఇంధనాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదని, నగదు రహిత చెల్లింపులకు కూడా ఊతమిచ్చినట్టు అవుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ట్యాగ్. ఫాస్టాగ్‌ను వాహనంలోని విండ్ షీల్డ్‌పై అంటిస్తారు. టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే ప్లాజాలో ఉన్న ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్ ట్యాగ్‌ను స్కాన్ చేస్తుంది. ఈ ట్యాగ్‌పై ఉన్న అకౌంట్ నుంచి టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది.