రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని గోపాలకృష్ణ గాంధీ ప్రకటించారు. విపక్ష కూటమి గోపాలకృష్ణ గాంధీని బరిలోకి దింపాలని భావించాయి. అయితే  తాను రాష్ట్రపతి అభ్యర్ధికి పోటీ చేయబోనని ప్రకటించారు.  

న్యూఢిల్లీ: President పదవికి తాను పోటీ చేయబోనని Gopalkrishna Gandhi తేల్చె చెప్పారు. విపక్ష కూటమి తరపున గోపాలకృష్ణ గాంధీని బరిలోకి దింపాలని భావించాయి. అయితే రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని గోపాలకృష్ణ గాంధీ ప్రకటించడం విపక్ష పార్టీలను షాక్ కు గురి చేసింది. 

రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని విపక్షాల కూటమి తరపున తనను ప్రతిపాదించాలని భావించడం పట్ల ఆయన ముందుగా విపక్ష పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేయబోనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గోపాలకృష్ణ గాంధీ ఓ ప్రకటనను విడుదల చేశారు. 

గోపాలకృష్ణ గాంధీ గతంలో West Bengal Governor గా పనిచేశారు. జాతిపిత మహాత్మాగాంధీ మనుమడే గోపాలకృష్ణ గాంధీ. తన కంటే ఈ పదవిని నిర్వహించే సమర్ధులు అనేక మంది ఉన్నారని ఆయన ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. విపక్షాలు తొలుత శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దింపాలని భావించాయి. అయితే క్రీయాశీలక రాజకీయాల్లో తాను ఇంకా కొనసాగాలని భావిస్తున్నట్టుగా Sharad Pawarప్రకటించారు.

మరో వైపు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేరుపై విపక్షాలు ఆలోచించాయి. అయితే Farooq Abdullah కూడా Kashmir సమస్య సద్దుమణిగే వరకు తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు. దీంతో గోపాలకృష్ణ గాంధీ వైపు విపక్షాలు చూశాయి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని విపక్షాలు గోపాలకృష్ణ గాంధీకి తెలిపారు. అయితే రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని గోపాలకృష్ణ గాంధీ ప్రకటించారు.

Sharad Pawar, Farooq Abdullah, గోపాలకృష్ణ గాంధీలు రాష్ట్రపతి పదవికి పోటీకి విముఖతను ప్రకటించారు. విపక్షాల కూటమి తరపున అభ్యర్ధి ఎవరనే విషయమై స్పష్టత రాలేదు. తమ కూటమి నుండి రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దింపుతారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 21న విపక్ష కూటమి మరో సారి సమావేశమై రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్ధిని నిర్ణయించే అవకాశం ఉంది.

రాష్ట్రపతి అత్యున్నత పదవికి రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్ధిత్వం కోసం తనను ప్రతిపాదించిన విపక్ష పార్టీలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. గత వారంలో ఢిల్లీలో మమత బెనర్జీ నేతృత్వంలో విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు.రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్ధిని ఉమ్మడిగా బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. 

మరో వైపు NDA కూటమి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలతో బీజేపీ నేతలు చర్చిస్తున్నారు. మరో వైపు రాష్ట్రపతి ఎన్నికల విషయమై ఎన్టీఏ కూటమి దూకుడుగా ముందుకు వెళ్తుంది. విపక్ష కూటమి మాత్రం బరిలోకి దింపే అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

also read:Presidential poll 2022: రాష్ట్రప‌తి ఎన్నిక‌లు.. ఇప్ప‌టివ‌ర‌కు 11 నామినేష‌న్ల దాఖ‌లు.. ఎవ‌రేవ‌రంటే..?

రాష్ట్రపతి ఎన్నికల విషయమై బీజేపీ నేతలు విపక్ష పార్టీల నేతలకు కూడా ఫోన్లు చేసి మద్దతును కోరారు. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గత వారంలో పోన్ చేశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాజ్‌నాథ్ సింగ్ ముందు ఎన్డీయే అభ్యర్థి పేరు చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతున్నట్టు విపక్ష నేతలు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.